ETV Bharat / lifestyle

గర్భణీగా ఉన్నప్పుడు ప్రయాణాలా..? ఇవి గుర్తుపెట్టుకోండి!

గర్భం ధరించామని తెలియగానే అతి సుకుమారంగా మారిపోతుంటారు మహిళలు. బరువులెత్తడం అటుంచితే.. తమ పనులు తాము చేసుకోవడానికీ వెనకా ముందూ అవుతుంటారు. ఇంకొంతమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. డెలివరీ అయ్యేదాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఎందుకంటే ఇలా తమ పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు కాబోయే అమ్మలు. అయితే ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని, అయితే అందుకు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి..!

author img

By

Published : Mar 28, 2021, 3:46 PM IST

safety precautions for pregnancy women's
ప్రయాణాల్లో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మన శరీరంలో ఉండే ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ గర్భాశయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ క్రమంలో గర్భాశయ ముఖద్వారాన్ని బిగుతుగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఫలితంగా మెట్లెక్కడం, ప్రయాణాలు, చిన్నపాటి కుదుపులు, వ్యాయామాలు.. వంటివి చేయడం వల్ల పిండానికి ఎలాంటి ఇబ్బందీ కలగదని చెబుతున్నారు నిపుణులు.

pregnancytravelling650-1.jpg
వైద్యుల సలహా అవసరం

అయితే గర్భం ధరించిన మహిళల్లో ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలో కొందరు చురుగ్గా ఉంటే.. మరికొందరు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా కాబోయే అమ్మలు మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.
తేలికైన ఆహారం.. సౌకర్యవంతమైన దుస్తులు!
* గర్భం ధరించిన మహిళల్లో వికారం, వాంతులు.. వంటి లక్షణాలు కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. అందుకే ప్రయాణాల్లో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రయాణ సమయంలోనూ తేలికపాటి ఆహారమే మంచిది.
* మధ్యమధ్యలో తినడానికి వీలుగా ఇంటి నుంచే ఆరోగ్యకరమైన స్నాక్స్‌, పండ్లు, ఇతర పదార్థాలు తీసుకెళ్లడం మంచిది. పైగా ప్రస్తుతం కరోనా భయం కూడా ఉంది కాబట్టి ఇంట్లో వండిన ఆహారమే సురక్షితం కూడా!

pregnancytravelling650-3.jpg
జాగ్రత్తలు మరవొద్దు..

* మీ ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్స్‌, మందులు.. వంటివన్నీ ఎప్పుడూ మీ బ్యాగ్‌లో మీతో పాటే ఉంచుకోవాలి. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు.
* ఓ నీళ్ల బాటిల్‌ను వెంట ఉంచుకోవడమూ మరవద్దు. అలాగే మధ్యమధ్యలో వీలుంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పడిపోకుండా ఉంటాయి.. అలాగే శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుంది. ఇక పండ్ల రసాలు తాగాలనుకున్న వారు ఇంటి నుంచే తయారుచేసి పట్టుకెళ్లడం ఉత్తమం.
* ప్రయాణాల్లో బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా, సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. తద్వారా కూర్చున్నా ఇబ్బందిగా అనిపించదు. అలాగే చెప్పుల విషయంలోనూ ఫ్లాట్స్‌ని ఎంచుకుంటే కంఫర్టబుల్‌గా నడవడానికి వీలవుతుంది.

pregnancytravelling650-2.jpg
అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలి..

* ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది కాబట్టి మరీ అత్యవసరమైతే తప్ప గర్భిణులు ప్రయాణాలు మానుకోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం మాస్క్‌, శానిటైజేషన్‌, సామాజిక దూరం పాటించడం.. వంటివి మరవద్దు.
* ఇక మధ్యమధ్యలో టాయిలెట్స్‌కి వెళ్లే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో ఆయా వాష్‌రూమ్స్‌ డోర్స్‌, నాబ్స్‌ని తాకినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి వీలుగా మీ వెంటే ఓ మినీ హ్యాండ్‌వాష్‌ బాటిల్‌ను ఉంచుకోవడం మంచిది. అలాగే అప్పుడప్పుడూ శానిటైజర్‌నూ చేతులకు రుద్దుకోవాలి.
* జెస్టేషనల్‌ డయాబెటిస్‌ లేదంటే మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీ (కవలలు, ట్రిప్లెట్స్‌కు జన్మనివ్వబోయే తల్లులు).. ఉన్న వారు విమానాల్లో ప్రయాణించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అలాగే 35 వారాలు దాటిన వారు కూడా విమాన ప్రయాణానికి నో చెప్పడమే మంచిదట! ఎందుకంటే ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రి-మెచ్యూర్‌ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట!
* ఇక కారులో వెళ్లే వారు సీట్‌బెల్టు పెట్టుకోవడం, మధ్యమధ్యలో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో వాహనాన్ని ఆపి కాసేపు రిలాక్సవడం, అటూ ఇటూ తిరగడం వల్ల ప్రయాణ అలసటను దూరం చేసుకోవచ్చు.

pregnancytravelling650-3.jpg
ఈ సమస్యలుంటే వద్దే వద్దు!

ఈ సమస్యలుంటే వద్దే వద్దు!
కొన్ని అనారోగ్యాలున్న గర్భిణులు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో..
* గతంలో గర్భస్రావం లేదా ప్రి-మెచ్యూర్‌ డెలివరీ అయిన వారు
* కవలలు లేదా ట్రిప్లెట్స్‌ తమ గర్భంలో పెరుగుతున్నట్లయితే (మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీ) ప్రయాణాలు మానుకోవడమే మంచిదట!
* గర్భాశయంలో ఏదైనా సమస్యలుంటే..
* గర్భం దాల్చిన తొలి నెలల్లో రక్తస్రావం లేదా ఇతర సమస్యలెదురైతే..
* ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం పెరగడం), లేటు వయసులో గర్భం ధరించిన వారు.. ఇలాంటి వారు గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు మానుకోవడమే ఉత్తమమట!

గర్భిణిగా ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదన్న విషయం అర్థమవుతోంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మాత్రం మరీ అత్యవసరమైతే తప్ప గర్భిణులు బయటికి రాకపోవడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం..! కాబట్టి ఈ విషయంలో మీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద పరీక్షించుకొని వారు చెప్పిన సలహాలు పాటిస్తే ఇటు మీరు, అటు మీ కడుపులో పెరుగుతోన్న బిడ్డ.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండచ్చు..!

ఇదీ చూడండి: కరోనాతో మానసిక కల్లోలం.. ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.