చర్మతత్వం, చుండ్రూ, ఒత్తిడీ, నిద్రలేమి, వంటివి మొటిమలకు కారణం. హార్మోన్ల అసమతుల్యత వల్లా ఈ సమస్య ఎదురవుతుంది.
ఇలాంటి వారు ఎక్కువ సౌందర్య లేపనాలను వినియోగించకూడదు. గాఢత ఎక్కువ ఉన్న షాంపూల కారణంగా చర్మం దెబ్బతింటుంది. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నా మొటిమలు వస్తాయి. తేనె, టీ ట్రీ ఆయిల్, ఆపిల్ సిడార్ వెనిగర్, గ్రీన్ టీ, కలబంద వంటి వాటిని చిట్కాలుగా ఉపయోగించి ముఖానికి పూత వేసుకుంటే ఇవి తగ్గుముఖం పడతాయి.
సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పెదాలు పగులుతాయి. అయితే కొంతమందిలో కాలంతో సంబంధం లేకుండానే ఈ పరిస్థితి ఎదురవుతుంది.
పెదాల పగుళ్లను నివారించాలంటే...శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. కోల్డ్ క్రీమ్‌లు, లిప్ బామ్‌లు సమస్యని తగ్గిస్తాయి. పెదాలను లాలాజలంతో తడపడం, పంటితో కొరకడం లాంటివి చేస్తే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు రోజూ రాత్రి పూట పెదాలకు కాస్త వెన్న రాసుకోండి. పెట్రోలియం జెల్లీ, నెయ్యీ, కొబ్బరినూనె, ఆలివ్ నూనె వంటి వాటినీ రాయొచ్చు. రెండు రోజులకోసారైనా చెంచా పంచదారలో, రెండు చుక్కల బాదం నూనె కలిపి మర్దన చేయండి. పెదాలు మృదువుగానూ మారతాయి.