ETV Bharat / lifestyle

ఈ ‘నెలసరి పాట’ను విన్నారా..!

author img

By

Published : Apr 24, 2021, 1:32 PM IST

అవును మీరు చదివింది నిజమే. ఇది నెలసరి పాట. దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం లాంటి పాట. ఉయ్యాల వేడుక, పుట్టిన రోజు, రజస్వల, పెళ్లి, అప్పగింతలు, శ్రీమంతం, ప్రసవం, బాలింత స్నానం... ఆడపిల్ల జీవితంలో ప్రతి సందర్భానికీ పాట ఉంది. యుక్త వయసు తర్వాత ఆడపిల్ల అనుభవించే నెలసరి వేదనపై ఏ పాటా లేదు. ఆ సమయంలో అమ్మాయిలు అనుభవించే నరకయాతనను అందరికీ తెలియజేయడానికే ఈ ‘నెలసరి పాట’ పుట్టింది.

period song, song on periods, pure founder shail thalluri
నెలసరి పాట, నెలసరి బాధపై పాట, ప్యూర్ సంస్థ స్థాపకురాలు శైల తాళ్లూరి

ఆడవారి జీవితంలో ప్రతి వేడుకకు ఓ పాట ఉంది. కానీ.. ఆడవాళ్లు అనుభవించే నెలసరి బాధపై ఎలాంటి పాట లేదు. కానీ హైదరాబాద్​కు చెందిన సేవా సంస్థ ‘ప్యూర్‌’ (పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండర్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌) స్థాపకురాలు శైలా తాళ్లూరి నెలసరి పాటను రచించారు. నెలనెలా ఆగని రక్తధారలు, వాటితో అమ్మాయిలు పడే శారీరక, మానసిక క్షోభ ఈ పాటలో వినిపిస్తాయి. కనీసం ఆ ధారలను దాచలేని స్థితిలో పేద పిల్లలు... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెలసరిలో ఏకాకిగా, అస్పృశ్యురాలిగా గడపాల్సిన వారి వేదన గుండెల్ని బరువెక్కిస్తుంది.

4 నిమిషాల 22 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట అందరినీ చేరాలి అంటుందీమె. ‘ప్రతి ఒక్కరికీ నెలసరి గురించి తెలిసుండాలి. ఆ సమయంలో మహిళలు అనుభవించే శారీరక బాధ, మానసిక వేదన, ఒత్తిడి, కుంగుబాటు ఎలాంటివో అందరికీ తెలియాలి. ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో కనీసం శానిటరీ ప్యాడ్స్‌ కూడా లేని పేదరికాన్ని తరిమికొట్టాలి. వీటిగురించి అవగాహన కల్పించేందుకు పాటే మంచి మార్గం అనుకున్నా. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలి’ అని చెబుతారామె. ‘ప్యాడ్స్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట వందల గ్రామీణ పాఠశాలల్లో నెలసరిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శైల.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.