ETV Bharat / lifestyle

మెనోపాజ్ దశలో అందాన్ని సంరక్షించుకోండిలా! - MENOPAUSE time HEALTHY tips

వేడి ఆవిర్లు, ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, మూడ్‌ స్వింగ్స్‌, బరువు పెరగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మెనోపాజ్‌ దశలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యలెన్నో! కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అతివల సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుందీ దశ. చర్మం పొడిబారడం, మొటిమలు-మచ్చలు ఏర్పడడం, నిర్జీవమైపోవడం.. వంటివి మెనోపాజ్‌ దశకు చేరువవుతోన్న వారిలో మనం గమనించచ్చు. అయితే ఇదంతా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగని అందం తగ్గిపోతుందని నిరుత్సాహపడకుండా చక్కటి స్కిన్‌కేర్‌ రొటీన్‌ పాటిస్తే సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Preserve the beauty during the menopause stage!
మెనోపాజ్ దశలో అందాన్ని సంరక్షించుకోండిలా!
author img

By

Published : Feb 27, 2021, 4:24 PM IST

మెనోపాజ్‌కు చేరువయ్యే కొద్దీ మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తలెత్తడం సహజం. ఈ క్రమంలో ఈస్ట్రోజెన్‌, కొలాజెన్‌ల పనితీరు మందగిస్తుంటుంది. ఫలితంగా చర్మం సాగిపోవడం, పొడిబారిపోవడం, నిర్జీవమైపోవడం, మొటిమలు, ప్యాచుల్లాంటి మచ్చలు.. వంటి సమస్యలొస్తాయి. మరి, వీటి నుంచి బయటపడాలన్నా/రాకుండా జాగ్రత్తపడాలన్నా ముందు నుంచే అందాన్ని సంరక్షించుకోవడం అవసరమంటున్నారు సౌందర్య నిపుణులు.

చర్మం సాగిపోతోందా?

పాడైపోయిన చర్మ కణాల్ని రిపేర్‌ చేయడం, కొత్త కణాల్ని ఉత్పత్తి చేయడం కొలాజెన్‌ పని. అలాంటి ప్రొటీన్‌ పనితీరు మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో తగ్గిపోతుంటుంది. తద్వారా చర్మం సాగిపోవడం, ముడతలు-గీతలు రావడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకే కొలాజెన్‌ పనితీరును పెంచుకోవడానికి ‘ఎ’, ‘సి’ విటమిన్లతో తయారైన సీరమ్‌, క్రీమ్స్‌ నిపుణుల సలహా మేరకు వాడడంతో పాటు ఈ విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్ని కూడా రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. ఈ క్రమంలో కమలాఫలం, పాలకూర, బ్రొకోలీ, స్ట్రాబెర్రీ.. వంటి పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

తేమను అందించే సప్లిమెంట్లు!

మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలకు ఎదురయ్యే అతి ముఖ్యమైన సమస్య చర్మం పొడిబారిపోవడం. శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోవడమే ఇందుకు కారణమట! అయితే ఇలా పొడిబారిన చర్మానికి తిరిగి తేమనందించడానికి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, పండ్ల రసాలు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే చేపలు, గుడ్లు, అవిసె గింజలు, ‘బి’ విటమిన్‌ ఎక్కువగా లభించే పదార్థాలు.. చక్కగా పని చేస్తాయి. మరీ అత్యవసరమైతే వైద్యుల సలహా మేరకు ఆయా పోషకాలను సప్లిమెంట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. అంతేకాదు.. రోజూ మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ రాసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, షవర్‌ కింద ఎక్కువ సేపు ఉండకపోవడం.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం తేమగా, నవయవ్వనంగా కనిపిస్తుంది.

అవాంఛిత రోమాలు తగ్గించుకోవాలంటే..!

మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గిపోయి, పురుష హార్మోన్లైన ఆండ్రోజెన్‌ స్థాయులు పెరగడం వల్ల అవాంఛిత రోమాల సమస్య అధికమవుతుంది. ఈ క్రమంలో గడ్డం, పైపెదవిపై అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. ఈ స్థితిని ‘హిర్సుటిజం’గా పిలుస్తారు. మరి, ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చక్కెరలు, కార్బోహైడ్రేట్లుండే ఆహారానికి దూరంగా ఉండడం, బరువును అదుపులో ఉంచుకోవడం, డాక్టర్‌ సలహా మేరకు యాంటీ-ఆండ్రోజెన్‌ సప్లిమెంట్లు వాడడం.. వంటివి చక్కటి ఫలితాన్నిస్తాయి. అయితే ఈ అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి కొంతమంది లేజర్‌ చికిత్స కూడా తీసుకుంటుంటారు. కానీ సున్నిత చర్మతత్వం ఉన్నవారు, లేత చర్మ రంగు గల వారు ఈ తరహా ట్రీట్‌మెంట్లకు దూరంగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఇలాంటి సౌందర్య చికిత్సలు వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయించుకోవడం ఉత్తమం. లేదంటే దుష్ప్రభావాలను కొనితెచ్చుకున్న వారవుతారు.

‘మినరల్‌ మేకప్‌’తో మెరిసిపోవచ్చు!

మెనోపాజ్‌ దశలో అసలే సౌందర్య సమస్యలు.. ఆపై మేకప్‌ అంటే.. సంకోచిస్తుంటారు చాలామంది మహిళలు! అయితే కొంతమందికి వృత్తిపరంగా, ఇతర కారణాల వల్ల మేకప్‌ వేసుకోవడం తప్పనిసరి కావచ్చు! అలాంటి వారు ‘మినరల్‌ మేకప్‌’ను ఆశ్రయించడం మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. ఐరన్‌, జింక్‌, టైటానియం.. వంటి సహజసిద్ధమైన ఖనిజలవణాలతో తయారుచేసే ఈ మేకప్‌ ఉత్పత్తుల్ని వాడడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ జరగదట! పైగా సున్నితమైన చర్మతత్వం ఉన్న వారికి ఇవి మరీ మంచివట! అయితే మేకప్‌ ఏదైనా మేకపే కాబట్టి వీలైనంత తక్కువగా వేసుకోవడం ఉత్తమం.

‘స్క్రబ్‌’ చేయాల్సిందే!

వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు చర్మంలోకి చేరి బ్లాక్‌హెడ్స్‌, మొటిమలు, మచ్చలు.. వంటి సౌందర్య సమస్యలకు కారణమవుతాయి. దీనికి మెనోపాజ్‌ దశ, వయసు పెరగడం.. వంటి అంశాలతో సంబంధం ఉండదు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి స్కిన్‌ ఎక్స్‌ఫోలియేషన్‌ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చర్మాన్ని స్క్రబ్‌ చేస్తూ బ్లాక్‌హెడ్స్‌, జిడ్డుదనం, చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కాఫీ స్క్రబ్‌, చక్కెర-తేనెతో చేసిన స్క్రబ్‌, ఓట్‌మీల్‌ స్క్రబ్‌.. ఇలాంటి సహజసిద్ధమైన మిశ్రమాల్ని ఉపయోగించచ్చు.

ఇక వీటితో పాటు బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, కంటి నిండా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి తప్పనిసరి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ మెనోపాజ్‌ దశలో ఇతర చర్మ సమస్యలేవైనా ఎదురైతే మాత్రం వెంటనే చర్మవ్యాధి నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

ఇదీ చూడండి : ఆ నటి తల్లికి అండగా సల్మాన్​ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.