ETV Bharat / lifestyle

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 9 సూత్రాలు తప్పనిసరి

author img

By

Published : Mar 1, 2022, 1:40 PM IST

Tips for Women Health: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలి.  ఇందులో మీరు చేయలేనివి, కష్టసాధ్యమైనవీ ఏమీ లేవు. వాటిని అనుసరించాలన్న పట్టుదల ఉంటే... మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

nine healthy tips
మహిళా ఆరోగ్యానికి 9 సూత్రాలు

Tips for Women Health: ఆరోగ్యానికి నవ సూత్రాలు

1 వ్యాయామం... ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి రోజూ వర్కవుట్లు చేయండి. దీని కోసం కనీసం ఓ గంటైనా కేటాయించాలి.
2 ఇంటా, బయటా పనులు... అలసిన మనసు సేద తీరాలంటే మీకు నచ్చిన పని కోసం రెండు గంటలు కేటాయించాల్సిందే. పుస్తక పఠనం, గార్డెనింగ్‌, కుటుంబంతో గడపడం... ఈ పనులకు కనీసం రెండు గంటలు కేటాయించాలి.
3 ఆరోగ్యం కావాలా... ఆహారాన్ని సమయానికి... తీసుకోవాలి. పోషక భరిత ఆహారాన్ని రోజులో మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తప్పక తీసుకోవాలి.
4 వ్యాయామం, పని... ఇలా వీటి నుంచి శరీరం, మనసుకు కాస్తంత విశ్రాంతిని కల్పించాలి. అందుకే రోజులో కనీసం నాలుగు స్వల్ప విరామాలు ఇస్తుండాలి.
5 ఆరోగ్యాన్నిచ్చే అంశాల్లో ఆహారాన్ని ప్రముఖమైందిగా చెప్పొచ్చు. పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజులో అయిదు రకాల పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి నుంచి లభించే పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయి.
6 చేసే పని మీద దృష్టి పెట్టాలంటే ఏకాగ్రత ఎంతో అవసరం. అది ధ్యానం చేయడం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి రోజూ కనీసం అయిదారు నిమిషాలు ధ్యానం చేయండి.
7 జీర్ణక్రియలు, జీవక్రియలు సాఫీగా జరగాలంటే నీళ్లు తాగడం చాలా అవసరం. రోజులో కనీసం ఏడు గ్లాసుల నీళ్లు తాగాల్సిందే.
8 ఆరోగ్యం సొంతమవ్వాలంటే... ఆహారం, వ్యాయామంతోపాటు శరీరానికి తగినంత విరామం ఉండాల్సిందే. అంటే తగినన్ని గంటలు నిద్రపోవాలి. రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.
9 వంద మైళ్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అడుగులేయాల్సిందే. అదేనండీ రోజులో దాదాపు 9000 అడుగులు వేయడం వల్ల బరువు తగ్గి, హెల్తీగా ఉండొచ్చట.

ఇదీ చదవండి: చిన్నవయసులోనూ గుండెపోటు ముప్పు.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.