ETV Bharat / lifestyle

అమ్మాయిలూ ఇరవైల్లో ఉన్నారా.. అయితే ఇవి మీకోసమే..! - tips for 20s girls

యుక్తవయసులో కోరికలకు రెక్కలిస్తూ కొత్త ఆశలకు వూపిరులూదడం సహజమే. అయితే ఈ దశలో మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే అందుకు పరిపూర్ణ ఆరోగ్యం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో 20ల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనమూ తెలుసుకుందాం రండి..

Health tips for young girls in 20s
Health tips for young girls in 20s
author img

By

Published : Aug 23, 2020, 7:44 AM IST

యుక్తవయసులోకి అడుగుపెట్టిన తర్వాత శరీరంలోని హార్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకోవడం తదనుగుణంగా శారీరకంగా, మానసికంగా కూడా పలు మార్పులు కనిపించే విషయం తెలిసిందే. ఈ దశలో అమ్మాయిలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు.

పచ్చని ప్రకృతిలో..

రోజూ ఎంత తీరికలేకుండా గడిపినా కాసేపైనా పచ్చని ప్రకృతితో తప్పకుండా మమేకం కావాలట! దీనివల్ల మనసు తేలికపడడంతోపాటు సృజనాత్మకంగా ఆలోచించడం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకోవడం బాగా అలవడుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఉదయం లేదా సాయంత్రం వేళ కాసేపు వాకింగ్ చేయడం, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా పార్కుల్లో విహరించడం, ఇంటి పనుల్లో భాగంగా గార్డెనింగ్‌కు సంబంధించిన పనుల్లో భాగస్వాములు కావడం.. వంటివి చేయాలని వారు సూచిస్తున్నారు.

అవి వద్దు..

ప్రస్తుతం అంతా ఇన్‌స్టంట్ ఫుడ్స్, డ్రింక్స్‌తోనే గడిపేస్తున్నారు. మీరూ అంతేనా.. అయితే వెంటనే వాటికి బై చెప్పేయండి. శరీర ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తేనే సరైన ఎత్తు, ఎత్తుకు తగిన శరీర సౌష్ఠవం లభిస్తాయి. కాబట్టి తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు.. మొదలైనవాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా శీతలపానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, డైట్ సోడా.. మొదలైనవాటన్నింటికీ స్వస్తి పలకాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవించడానికి ఒక హెల్దీ మార్గం ఏర్పరుచుకున్నట్లు అవుతుంది. అలాగే తినే ఆహారపదార్థాలు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే తయారుచేసినవైతే మరీ ఉత్తమం.

చక్కెర తక్కువగా..

ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకున్నా అందులో చక్కెర స్థాయులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా రక్తంలోని చక్కెరస్థాయులు క్రమంగా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

వ్యాయామం తప్పనిసరి..

రోజూ ఉదయాన్నే కాసేపు ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. ఫలితంగా శరీరంలో పేరుకుపోయిన అదనపు కెలొరీలు కరగడంతోపాటు కండరాలు దృఢంగా మారడం వల్ల ఫిట్‌గా కూడా ఉండచ్చు. అలాగే హార్మోన్లు సైతం సమతూకంలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

హెల్త్ చెకప్స్..

ఒంట్లో నలతగా ఉంటేనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్నది చాలామంది భావన. కానీ వయసుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమయ్యే నిర్ణీత వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కూడా వైద్యులను సంప్రదించాలి అంటున్నారు నిపుణులు. అలాగే వైద్యుల అనుమతి లేకుండా యాంటీబయోటిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం, సొంతంగా చికిత్స చేసుకోవడం.. వంటివి కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి సమస్య ఏదైనా సంబంధిత వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వేసుకోవడం మంచిది.

కూర్చోవద్దు..

కొంతమంది ఎప్పుడూ ఎక్కువగా కూర్చొనే ఉంటారు. అయితే ఎవరైనా సరే తక్కువ సమయం కూర్చుని, ఎక్కువ సమయం నిలబడి ఉండాలట! దీని వల్ల శరీరానికి కాస్త వ్యాయామం లభించడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందట! దీని కోసం మెట్లు ఎక్కడం, దిగడం, ఎక్కువగా నడవడం, శరీరానికి శ్రమ కలిగే పనులు చేయడం.. వంటివి చేయాలి.

ప్రశాంతమైన నిద్ర..

పని ఒత్తిడి, ఆందోళనలు ఎంతున్నా సరే.. పడుకొనే సమయానికి మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోయేలా జాగ్రత్తపడాలి. అప్పుడే మెదడుకు సరిపడినంత విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా చురుగ్గా పని చేస్తుంది.

సౌందర్యపరంగా..

చర్మ, కేశ సంరక్షణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం, ట్యాన్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. మొదలైనవి చేయాలి. ఉదయం, రాత్రి పడుకొనే ముందు సౌందర్య సంరక్షణకు ఎంతో కొంత సమయం కేటాయించుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తగిన వ్యాయామం చేస్తూ, అందాన్ని సంరక్షించుకుంటేనే ఫిట్‌గా, అందంగా కనిపించే వీలు ఉంటుంది.

ఇవీ అవసరమే!

  • పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, పుస్తకాలు చదవడం.. ఏదైనా సరే నచ్చిన అభిరుచిపై మనసు లగ్నం చేయడం.
  • మీకంటూ వ్యక్తిగతంగా ఎంతో కొంత సమయం కేటాయించుకోవడం.
  • నచ్చిన వ్యక్తులతో సమయం గడపడం.
  • రోజువారీ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం.
  • వీలైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం మొదలైనవి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.