- ఉడకబెట్టిన ఆపిల్ గుజ్జులో కప్పు పాలు, రెండు చెంచాల ఓట్స్, కొద్దిగా తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే టాన్ తొలగిపోతుంది.
- పావుకప్పు ఆపిల్ గుజ్జుకి కోడిగుడ్డులోని తెల్లసొన, టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంటయ్యాక గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టుకి పోషణ అంది ఆరోగ్యంగా ఉంటుంది.
- పావుకప్పు ఆపిల్ గుజ్జులో చెంచా ఉలవపిండి, కలబంద గుజ్జు, కొద్దిగా తేనెని కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి నలుగులా పెట్టుకుంటే చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
- మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో ముఖం కాంతివిహీనంగా మారినప్పుడు ఇలా చేయండి. పావుకప్పు ఆపిల్ గుజ్జులో చెంచా పాలపొడి, కొద్దిగా తేనె, టీస్పూన్ తులసి కలపాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంటయ్యాక కడిగేస్తే మచ్చలు దూరమవుతాయి.
ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం