చిన్నారుల పెంపకం(Parenting)లో అమ్మకు తెలిసినన్ని కిటుకులు మరెవరికీ తెలియదు. కానీ....టీనేజీ పిల్లలున్నప్పుడు మాత్రం కాస్త తడబాటు తప్పదు. వారిపై పట్టుకోల్పోకూడదంటే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పకపోవచ్చు.
గమనించండి... ఎదిగే పిల్లల ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు గమనించుకోగలిగితే చాలా సమస్యలకు చెక్‌పెట్టొచ్చు. ముఖ్యంగా వారి ఎంపికలను, సమీక్షలను, విమర్శలను ఒకింత పరిశీలనగా చూస్తూంటే...వారి వ్యక్తిత్వాన్ని పసిగట్టేయగలరు. దాన్ని బట్టే మంచీ, చెడు వారికి చెప్పగలరు.
ఇవీ చదవండి :
- Parenting Tips: పిల్లలకు ఓటమి నుంచి గెలవాలనే ఆకాంక్ష నేర్పండిలా!
- parenting tips: ఆరంభంలోనే అసూయకు చెక్ పెట్టాలి..
నచ్చకపోయినా... కాలంతో పాటు మనమూ మారాలి. వారి స్టైల్, అలవాట్లు, స్నేహాలు...కాస్త ఇబ్బంది కలిగించొచ్చు. వారు తీసుకునే నిర్ణయాలు ఏవైనా నచ్చకపోయినా సరే! వారి అభిప్రాయాల్ని గౌరవించండి. అలా వాటిని ఎంపిక చేసుకోవడంలో వారి ఉద్దేశం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తప్పుదారిలో నడుస్తుంటే మాత్రమే అడ్డు చెప్పడానికి వెనుకాడొద్దు. అప్పుడే వారు మీ మార్గంలో నడుస్తారు.
మారండి... ప్రతి అమ్మానాన్నలూ...పిల్లలకోసమే జీవితాన్ని, కష్టాన్ని ధారపోస్తారు. అయితే మీరు చేసే ప్రతి పనిలో వారి ఇష్టాలూ ఇమిడి ఉండాలని మాత్రం మరిచిపోవద్దు. అప్పుడే వారు మీ త్యాగాన్ని, ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటారు.
ఇవీ చదవండి :
అందిపుచ్చుకోండి... కాలంతో పాటు లోకం పోకడా మారుతుంది. మీరు అలానే మారాల్సిన అవసరం లేదు...కానీ మార్పుని గుర్తించండి. మీ ఆలోచనలు, ఇష్టాయిష్టాలు...పిల్లలకి పాతచింతకాయ పచ్చడిలా ఉండొచ్చు. అంతమాత్రాన మీరంటే ఇష్టం లేదనీ, మిమ్మల్ని లెక్కచేయడం లేదనీ కాదు...మీరే వారిలా ఆలోచించడానికి ప్రయత్నించండి. అవన్నీ వారినే అడిగి తెలుసుకోండి. ఇవన్నీ పిల్లల ఆలోచనల్ని అందిపుచ్చుకునేందుకు సాయం చేస్తాయి.