ETV Bharat / lifestyle

PATRENTING TIPS: మీ పిల్లలు మాట వినడం లేదా? అయితే ఇలా చేయండి! - TELANGANA LATEST NEWS

టీనేజీ వచ్చిందంటే చాలు... పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం మానేస్తారు. చీటికీమాటికీ చిరాకుపడిపోతూ అమ్మానాన్నలను కంగారు పెట్టేస్తుంటారు. అలాంటప్పుడు పెద్దలే ఓర్పుగా ఉండి కింది చిట్కాలను పాటిస్తే... పిల్లలు మీరు చెప్పినట్లు వింటారు.

parenting-tips-for-raising-teenagers
మీ పిల్లలు మాట వినడం లేదా? అయితే ఇలా చేయండి!
author img

By

Published : Jul 19, 2021, 9:28 AM IST

టీనేజీలో పిల్లలు...అన్నీ మాకు తెలుసంటంటుంటే అమ్మానాన్నలకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వారు తమని లెక్కచేయడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడు పదే పదే వారిని హెచ్చరించినా, అదుపులో పెట్టాలని చూసినా మొదటికే మోసం వస్తుంది. అలాకాకుండా మీరు ఓర్పుగా, నేర్పుగా ఈ చిట్కాలు పాటించి చూడండి.

కంగారొద్దు...

నాకు తెలుసు. నాకేం చెప్పొద్దు’ అనేది మీ ఒక్కరి పిల్లలే కాదు. ఆ వయసు వారందరిలోనూ అలాంటి తత్వమే కనిపిస్తుంది. కాబట్టి, మొదట మీరు చేయాల్సింది కంగారు పడొద్దు. వీలైతే వారేం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో గమనించండి. ఒకసారి విఫలమైతే...రెండోసారి వారూ జాగ్రత్త పడతారు. ఆ నిర్ణయం వల్ల ఎదురైన పర్యవసానాలను చెబితే భవిష్యత్తులో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరు. బదులుగా మీరే గాభరా పడిపోతుంటే సమస్య మరింత చిక్కుముడి పడుతుంది.

అన్నీ మీరే చేయాలనుకోవద్దు..

చిన్నారులు ఎదుగుతుంటే...వారితో పాటూ వారి ఆలోచనలూ పెరుగుతాయి. ఇలాంటప్పుడు వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, అభిప్రాయాలను మన్నించడం వంటివి చేయండి. అలాకాకుండా నీకేం తెలియదంటూ, నీకిదే బాగుంటుందంటూ...బొమ్మరిల్లు సినిమాలో నాన్నలా అన్నీ మీరే చేసేయొద్దు. అప్పుడే పిల్లలు తమ ఆలోచనల్ని, అభిప్రాయాల్నీ మీతో పంచుకుంటారు.

క్లాసులు వద్దు...

టీనేజీలో ఉన్నవాళ్లకు అతినియంత్రణ అస్సలు నచ్చదు. మీరు కూడా...వారు మరీ పసివాళ్లు కాదనే విషయం గుర్తించాలి. ఒకే విషయం గురించి పదే పదే చెప్పడం, వారి లోపాలను ఎత్తి చూపించడం చేస్తే ‘రోజూ ఇదే సుత్తి’ అనుకుంటారు. మీ దగ్గర కంటే బయట ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతారు. దాంతో మరిన్ని కొత్త సమస్యలు రావొచ్చు. ఇవన్నీ కొన్ని పరిష్కార మార్గాలు మాత్రమే. వ్యక్తికి, వ్యక్తికి మధ్య సమస్యలు భిన్నంగా ఉండొచ్చు. అలాంటిది ఏదైనా కనిపిస్తే, ఇది సాధారణం కాదు. అసాధారణంగా అనిపిస్తే పిల్లలను డాక్టర్‌ దగ్గరకు తీసుకుని వెళ్లడంలో తప్పేం లేదు.

ఇదీ చూడండి: పిల్లల తెర సమయం ఈ విధంగా తగ్గిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.