నిద్రపోయే ముందు చిన్నారులకు రోజూ ఓ కథను చెప్పడం అలవాటు చేయాలి. దీనివల్ల వాళ్లకు కథలంటే ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి చాలా కథలు పుస్తకాల్లో ఉంటాయని చెప్పాలి. దీంతో పుస్తకాలు చదవాలనే ఆసక్తికి చిన్నతనంలోనే బీజం పడుతుంది.
- రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండే కథల పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి. ముందుగా వాటిని చూడటం అలవాటు చేస్తే అందులోని బొమ్మలను ఆసక్తిగా గమనిస్తుంటారు. ఆ తర్వాత వాటిలోని అక్షరాలను చదవడానికి మెల్లగా ప్రయత్నిస్తుంటారు.
- నిత్యావసర వస్తువుల లిస్టును తయారుచేసినప్పుడు అందులో ఉన్న వస్తువుల పేర్లను పిల్లలతో చదివించవచ్చు. పిల్లలకు ఇష్టమైన వంటకం తయారీ విధానాన్ని వాళ్లతోనే చదివించాలి.
- నేరుగా కథల పుస్తకాలనే కాకుండా ముందుగా చిన్నచిన్న పదాలను చదవడం అలవాటు చేయాలి. రోడ్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండే బోర్డులను చదివిస్తుండాలి. పిల్లలని టీవీ, సినిమా తెరల మీద కనిపించే పేర్లను చదవమనండి. అవి ఇలా వచ్చి అలా మాయమవుతుంటాయి కాబట్టి వాటిని వేగంగా చదవడం అలవాటవుతుంది.
ఇదీ చదవండిః నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!