చాలామంది తల్లులు పిల్లల కడుపు నింపాలనే ఉద్దేశంతో వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే కుక్కి పెడుతుంటారు. దీనివల్ల పిల్లలు తినడం అంటేనే... అయిష్టత పెంచుకుంటారు. అలాకాకుండా ముందు వారికి ఏం ఇష్టమో తెలుసుకోవాలి. అవి రుచి చూపిస్తూనే, మరో పదార్థాన్నీ దానికి కలగలిపి వండాలి. అలా క్రమంగా అన్ని రకాల వంటకాల్నీ ఇష్టపడేలా చేయాలి.
చిన్నారికి అన్ని పోషకాలు అందేలా చూడటంలో తల్లిగా మీదే కీలకపాత్ర. పిల్లలు ఎప్పుడూ ఒకే తరహా రుచుల్ని ఇష్టపడకపోవచ్ఛు బయటదొరికే జంక్‌ఫుడ్‌కి ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ రుచుల్లో కాయగూరలూ, ఆకుకూరల వంటివాటితో ప్రయత్నించండి. అలానే వండేది ఏదైనా సరే చక్కటి రుచితో పాటు కంటికింపుగానూ ఉండేలా చూసుకోవాలి. సువాసన... తినాలనే ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే వాటిపై మిరియాలపొడి, మసాలాలు, కొత్తిమీర వంటివి చల్లండి. ఇవన్నీ వారి దృష్టిని ఆకర్షించేందుకు సాయపడతాయి.
ఇదీ చదవండిః బయటికి చెప్పరు.. కానీ దీని గురించే గొడవ పడతారట !