ETV Bharat / lifestyle

World Breastfeeding Week: తల్లిపాలపై ఎన్నో అపోహలు.. అందులో నిజమెంత? అబద్ధమెంత? - vasundhara stories

బిడ్డను చిరంజీవిని చేసే అమృతం.. చనుబాలు!  కానీ ఇప్పటికీ తల్లిపాల విషయంలో ఎన్నో అపోహలు అమ్మలని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్‌ వంటివి. వాటిల్లో ఏవి నిజమో ఏవి కాదో తెలుసుకుందాం...

is-it-better-to-breastfeed-if-you-have-breast-cancer
తల్లిపాలు శ్రేయస్కరమేనా..?
author img

By

Published : Aug 4, 2021, 9:54 AM IST

Updated : Aug 4, 2021, 10:18 AM IST

అపోహ: తల్లికి క్యాన్సర్‌ ఉంటే అది పాల ద్వారా బిడ్డకూ వస్తుంది..

వాస్తవం: ఇంతవరకూ ఏ అధ్యయనమూ ఈ విషయాన్ని నిర్ధరించలేదు. ఒకవేళ ఆ సమయంలో కీమోథెరపీ వంటి చికిత్సలు తీసుకొంటూ ఉంటే మాత్రం పాలివ్వకూడదు. అది బిడ్డకు హానిచేసే ఆస్కారం ఉంది. అలాగే రేడియోథెరపీ, హార్మోన్‌థెరపీ వంటివి తీసుకునేవారూ పాలివ్వకూడదు. వాటి ప్రభావం బిడ్డపై ఉంటుంది.

అపోహ: బిడ్డకు పాలిచ్చే సమయంలో రొమ్ముక్యాన్సర్‌ రాదు..

వాస్తవం: అది నిజం కాదు. పాలిచ్చే సమయంలో కూడా రొమ్ముక్యాన్సర్‌ రావడానికి ఆస్కారం ఉంది. అందుకే రొమ్ములో గడ్డలువంటివి ఏవైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

అపోహ: రొమ్ముకు కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకుంటే పాలురావు.

వాస్తవం: ఇది పూర్తిగా నిజం కాదు. చాలామంది రొమ్ము పరిమాణాలని మార్చుకొనేందుకు సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొంత బ్రెస్ట్‌ టిష్యూని తొలగించాల్సి వస్తుంది. ఈ ప్రభావం బిడ్డకు అందే పాలపై పడుతుంది. అందుకే సర్జరీ చేయించుకునేటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం మంచిది. ఈ విషయాన్ని సర్జన్‌కి స్పష్టంగా చెబితే పాలగ్రంథులపై ఆ ప్రభావం పడకుండా సర్జరీలో మార్పులు చేస్తారు.

తల్లిపాల వారోత్సవాలు(ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు)

అపోహ: క్యాన్సర్‌ వచ్చి తగ్గిన వారు బిడ్డకు పాలివ్వకూడదు.

వాస్తవం: ఇందులో వాస్తవం లేదు. గతంలో రొమ్ముక్యాన్సర్‌ కారణంగా రొమ్ము సర్జరీ, రేడియోథెరపీ చేయించుకున్నా బిడ్డకు పాలివ్వొచ్చు. కానీ ఆ స్తన్యం నుంచి తగినంతగా పాలు రాకపోవచ్చు.

అపోహ: రొమ్ముల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే బిడ్డకు పాలివ్వకూడదు...

వాస్తవం: ఇది కొంతే వాస్తవం. రొమ్ములో ఉండే ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అక్కడ వాపు, నొప్పి వంటివి వేధిస్తాయి. అలాంటప్పుడు బిడ్డకు పాలు ఇవ్వడం మంచిది కాదంటారు చాలామంది తల్లులు. కానీ కొన్నిసార్లు పాలివ్వడం వల్లే ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్‌ వాడాలి. అప్పటికీ తగ్గకపోతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా సూదితో చీముని తొలగిస్తారు. కొన్నిసార్లు సర్జరీ కూడా పడొచ్చు. ఆ తర్వాత బిడ్డకు పాలివ్వొచ్చు.

జాగ్రత్తలు: గర్భిణిగా ఉండగా... లేదా బిడ్డకు పాలిచ్చేటప్పుడు రొమ్ముక్యాన్సర్‌ని నిర్ధరించే మమోగ్రామ్‌ పరీక్ష చేయించుకోకూడదు. దీని నుంచి తక్కువ మొత్తంలోనే రేడియేషన్‌ అందినా అది శిశువుకు మంచిది కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్న తల్లులు తప్పనిసరిగా ఆరునెలలపాటు తల్లిపాలని అందించాలి. అలాగే ఆ సమయంలో వెద్యులు సూచించే యాంటీ రెట్రో వైరల్‌ థెరపీ తప్పనిసరిగా తీసుకోవాలి.

పి. రఘురామ్ (డైరెక్టర్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్)

ప్రపంచవ్యాప్తంగా 170కు పైగా దేశాలు ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునిసెఫ్‌తో కలిసి ఈ వారోత్సవాలని ఏటా నిర్వహిస్తోంది. ఈ ఏడాది థీమ్‌ తల్లిపాల సంస్కృతిని కాపాడ్డం మనందరి బాధ్యత.

ఇదీ చూడండి: World Breastfeeding Week: అప్పుడే పుట్టిన బిడ్డకు అమృత ఘడియలవి!

Last Updated : Aug 4, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.