- ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. సరదా కోసం ప్రయత్నించి సమస్యలు తెస్తారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. వారి అసంతృప్తిని అర్థం చేసుకోండి. కాస్త దగ్గరుండి...ఓపికగా వారి ఆలోచనల్ని తెలుసుకోండి. వారి మాట ఊ కొడుతూనే మీరు పట్టు తెచ్చుకోండి. అప్పుడే మాట వింటారు.
- చిన్నారులపై మీ అభిప్రాయాల్నీ, ఇష్టాయిష్టాల్నీ బలవంతంగా రుద్దొద్దు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని చెప్పే అవకాశం కల్పించండి. అలానే చిన్నప్పటి నుంచీ మంచీ చెడుల్ని, కష్టసుఖాల్నీ అర్థం చేసుకునే అలవాటుని నేర్పండి. తమ పనులు తామే చేసుకునేలా చేయండి. క్రమంగా ఇవన్నీ తమ దినచర్యలో భాగం అనుకుంటారే తప్ప భారం అనుకోరు.
- మనసులో ఉన్న బాధ, కోపాన్ని ఏదోరకంగా మాటల్లో చెప్పగలిగే పిల్లల్లో మొండితనం, కోపం తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎప్పుడైనా పిల్లలు మొండికేస్తుంటే బలవంతంగా వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూడకండి. వారి సమస్యను అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా తనలానే ప్రవర్తించే వారుంటే ముందు వారిలో మార్పు రావాలి. ఆపై వారిని చూసి...పిల్లలు అనుసరిస్తారు. వారిలోనూ ఒత్తిడి ఉంటుందని గ్రహించండి. తగిన పోషకాహారం ఇవ్వడం, వ్యాయామం చేయించడం వంటివన్నీ చేస్తే సమస్య అదుపులోకి వస్తుంది. వీటితోపాటూ అమ్మగా మీరు లాలించడం మరిచిపోవద్దు.
ఇవీచూడండి: అమ్మలూ... ఇవే మీ ఆయుధాలు