ETV Bharat / lifestyle

PCOS issues : ఇలా చేస్తే పీసీఓఎస్‌ ఉన్నా పిల్లలు పుడతారట! - Pregnancy problem with PCOS issues

పెళ్లైన మహిళలు అమ్మతనం కోసం ఆరాటపడుతుంటారు. తాము ఎప్పుడెప్పుడు తల్లిగా ప్రమోషన్‌ పొందుతామా అని ఎదురుచూస్తుంటారు. అయితే కొంతమంది తమ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ఇతర సమస్యల కారణంగా అమ్మతనం కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరికొంతమంది ఇలాంటి సమస్యలతో అమ్మయ్యే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. అలాంటి సంతానలేమి సమస్యల్లో పీసీఓఎస్‌(PCOS issues) ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఏడుగురిలో ఒక్కరు దీని బారిన పడుతున్నారని, సుమారు 50 శాతం మంది తమకు పీసీఓఎస్‌ ఉందన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మరి, పీసీఓఎస్‌ వస్తే పిల్లలు పుట్టరా? జీవితాంతం గొడ్రాలుగానే మిగిలిపోవాల్సిందేనా? అంటే.. ఆ భయం అక్కర్లేదంటున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక సమస్యే అయినా దీన్ని అదుపులో ఉంచుకొని మన జీవన విధానంలో చిన్న పాటి మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సమస్య ఉన్నప్పటికీ అమ్మగా ప్రమోషన్‌ పొందచ్చని భరోసా ఇస్తున్నారు. మరి, పీసీఓఎస్‌(PCOS issues) ఉన్నా పిల్లలు పుట్టాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

PCOS issues
PCOS issues
author img

By

Published : Oct 16, 2021, 10:16 AM IST

పీసీఓఎస్‌(PCOS issues) ఉందని తెలిసినప్పట్నుంచి మహిళల్లో ఏదో తెలియని భయం, ఆందోళన ఆవహిస్తాయి. ఇది దీర్ఘకాలిక సమస్య కాబట్టి ఇక తమకు పిల్లలు పుట్టరని, ఇతరత్రా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని మథన పడుతుంటారు. అయితే ఇది దీర్ఘకాలం పాటు మనతోనే ఉన్నప్పటికీ నిపుణుల సలహా మేరకు మందులు వాడుతూ చక్కటి జీవన విధానం అలవాటు చేసుకుంటే ఈ సమస్యను అదుపు చేసుకోవడమే కాదు.. సంతాన భాగ్యానికీ నోచుకోవచ్చంటున్నారు నిపుణులు.

బరువు తగ్గాల్సిందే!

బరువు తగ్గాల్సిందే!

పీసీఓఎస్‌(PCOS issues) కారణంగా మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుంది. తద్వారా గర్భం ధరించే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతాయి. కాబట్టి ముందుగా బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీ బీఎంఐ ఎంత ఉందో చెక్‌ చేసుకోవాలి. సాధారణంగా గర్భం ధరించాలనుకునే మహిళల బీఎంఐ 18.5 – 24.9 మధ్యలో ఉంటే వారు ఆరోగ్యకరమైన బరువున్నారని అర్థం. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ముందుగా బరువు తగ్గాకే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవాలని, లేదంటే ఇటు మీ ఆరోగ్యం, అటు కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. ఇలా మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు వ్యాయామాలను మీ రొటీన్‌లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు కనీసం అరగంటైనా ఇందుకు కేటాయించాలి. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని ఓసారి వైద్యుల వద్ద చెక్‌ చేయించుకొని ఏయే వ్యాయామాలు చేయచ్చన్న విషయంలో వారి సలహా తీసుకుంటే మరీ మంచిది.

ఆ సమయం తెలుసుకొని..!

ఆ సమయం తెలుసుకొని..!

నెలనెలా వచ్చే నెలసరి పదే పదే క్రమం తప్పుతోందంటే అందుకు పీసీఓఎస్‌(PCOS issues) కూడా ఓ కారణమై ఉండచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ అదే నిర్ధారణ అయితే మాత్రం నెలసరి సక్రమంగా వచ్చేలా చేసుకోవడం తప్పనిసరి.. లేదంటే గర్భధారణ కష్టమవుతుంది. అయితే పీసీఓఎస్‌ కారణంగా మనం పెరిగిన బరువు తగ్గే క్రమంలోనూ మన ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య తగ్గడంతో పాటు, ఇది అండోత్పత్తి సరైన సమయంలో జరగడానికి సైతం దోహదం చేస్తుంది. తద్వారా ఆ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే అండోత్పత్తి (ఒవ్యులేషన్‌) సమయం మాకెలా తెలియాలి అనుకున్న వాళ్ల కోసం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఒవ్యులేషన్‌ క్యాలిక్యులేటర్స్‌, యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆశ్రయిస్తే మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది.

ఇన్సులిన్‌ అదుపులో ఇలా..!

ఇన్సులిన్‌ అదుపులో ఇలా..!

పీసీఓఎస్‌(PCOS issues)తో బాధపడే మహిళల్లో సాధారణ వ్యక్తుల కంటే ఇన్సులిన్‌ స్థాయులు అధికంగా ఉంటాయి. ఇందుకు కారణం ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులే! తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మధుమేహానికి దారితీసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి పీసీఓస్‌ ఉన్న వారు గర్భం ధరించడానికి ముందు తమ శరీరంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా లభించే గుడ్లు, బాదంపప్పులు, ఓట్స్‌, పాలు, పాల పదార్థాలు, చికెన్‌.. వంటివి రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, వైట్‌ బ్రెడ్‌.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలా ఆహార నియమాలతో పాటు నిపుణుల సలహా మేరకు చేసే కొన్ని వ్యాయామాలు సైతం మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

‘డి’లోపం లేకుండా!

‘డి’లోపం లేకుండా!

పీసీఓఎస్‌(PCOS issues)తో బాధపడే మహిళల్లో దాదాపు 41 శాతం మందిలో విటమిన్‌ ‘డి’ లోపం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇది సంతానలేమికి దారితీస్తుంది. కాబట్టి మన శరీరంలో ఈ విటమిన్‌ స్థాయులు తగినంతగా ఉండాలి. సాధారణంగా గర్భం ధరించాలనుకునే మహిళల శరీరంలో డి విటమిన్‌ స్థాయులు 30 ఎన్‌జీ/ఎంఎల్‌గా ఉండాలంటున్నారు నిపుణులు. దీన్ని ఇలాగే కొనసాగించాలంటే రోజూ కాసేపు నీరెండలో నిల్చోవడం; మాంసం, గుడ్లు, చేపలు.. వంటి విటమిన్‌ ‘డి’ అధికంగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది. ఇలా తగినంత విటమిన్‌ ‘డి’ శరీరానికి అందడం వల్ల అది అండం ఆరోగ్యంగా ఎదగడంలో, అభివృద్ధి చెందడంలో సహకరిస్తుందట! ఒకవేళ మీ శరీరంలో విటమిన్‌ ‘డి’ స్థాయులు మరీ తక్కువగా ఉన్నట్లయితే మాత్రం వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ వాడడం తప్పనిసరి.

ఇలా వీటన్నింటితో పాటు ఒత్తిడికి గురికాకుండా యోగా, ధ్యానం చేయడం; జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌.. వంటి అనారోగ్యపూరిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల కూడా పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవచ్చు.. తద్వారా ఈ సమస్య ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన పాపాయికి జన్మనివ్వచ్చు.. అమ్మతనాన్ని ఆస్వాదించచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.