ETV Bharat / lifestyle

చిన్నతనంలో తీసుకునే ఆహారంతోనే రోగనిరోధక శక్తి - immunity with healthy food

చిన్నతనంలో తీసుకునే ఆహారంపైనే రోగనిరోధక శక్తి ఆధారపడి ఉంటుందంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. చిన్నప్పుడు పంచదార, కొవ్వుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మైక్రోబయోమ్​లో వైవిధ్యం తగ్గిపోయి పెద్దయ్యాక ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని వెల్లడించారు.

we-can-get-immunity-with-health-food-habits-in-childhood
చిన్నతనంలో తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం
author img

By

Published : Feb 21, 2021, 11:58 AM IST

పెద్దయ్యాక ఏం తింటున్నామనేదే కాదు, పిల్లలుగా ఉన్నప్పుడు ఏం తిన్నారనేదీ ఎంతో ముఖ్యమే అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. చిన్నప్పుడు పంచదార, కొవ్వుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తింటే, పెద్దయ్యాక ఎంత మంచి ఆహారం తీసుకున్నా పెద్ద ఉపయోగం ఉండదట. ఎందుకంటే చిన్నతనంలో తీసుకున్న కొవ్వులూ, చక్కెర పదార్థాల వల్ల పొట్టలోని మైక్రోబయోమ్‌(బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ల సమ్మేళనం)లో మారిపోయి, వైవిధ్యం తగ్గిపోతుంది. అలా మారినదే జీవితాంతం ఉండిపోతుంది. మైక్రోబయోమ్‌లో ఎంత వైవిధ్యం ఉంటే అంత రోగనిరోధకశక్తి ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు విటమిన్ల తయారీకి తోడ్పడుతుందట.

ఈ విషయమై ఎలుకల్లో పరిశోధనలు చేయగా- చిన్నవయసులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా పెట్టిన ఎలుకల్లో బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గిపోయిందనీ, పెరిగి పెద్దయ్యాక వాటి ఆహారంలో మార్పులు చేసినా ఆ బ్యాక్టీరియాలో పెద్ద తేడా కనిపించలేదనీ తేలిందట. ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో ఆరేళ్లలోపు పిల్లలు కొవ్వు, చక్కెరలతో నిండిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారనీ దీనివల్లే వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియాలో వైవిధ్యం తగ్గిపోతుందనీ చెబుతున్నారు. అదేసమయంలో ఆహారం తీసుకుని వ్యాయామం చేసిన పిల్లల మైక్రోబయోమ్‌లో పెద్దగా మార్పు లేదట. అదే ఆ వయసులో వ్యాయామం లేకుండా అదేపనిగా కొవ్వుపదార్థాల్ని తిన్నవాళ్లలో ఈ నష్టం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయడాన్ని చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి అంటున్నారు సదరు పరిశోధకులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.