- ఉదయం అరగంటకు తక్కువ కాకుండా నడవటం లేదా వ్యాయామం తప్పనిసరి. ఇది రక్తప్రసరణ సాఫీగా ఉండేలా చేస్తుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
- బ్రేక్‌ఫాస్ట్ ఆకలి తీరిస్తే సరిపోదు. శక్తినిచ్చే పోషకాహారం అయ్యుండాలి. అప్పుడే జీవకణాల్లో రసాయనిక చర్య (మెటబాలిజం) సవ్యంగా ఉంటుంది.
- శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు ఎక్కువ తాగాలి. రోజుకు రెండు లీటర్ల నీరు తాగగలిగితే సగం సమస్యలను నివారించినట్లే.

- శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, జింక్- ఈ మూడూ తక్కువ కాకుండా చూసుకోవాలి. అందుగ్గానూ పాలు, యోగర్ట్, బాదం, నువ్వులు, జీడిపప్పు, అరటి మొదలైన పండ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, క్యారట్, సోయా, బఠాణీలు తింటుండాలి.
- అధిక బరువు అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక ఎప్పటికప్పుడు బరువు చూసుకుంటూ పెరిగినట్లనిపిస్తే అప్రమత్తం కావాలి. థైరాయిడ్ సమస్య వుందేమో చెక్ చేయించుకుని అవసరమైన మందులు వాడాలి.
- వేళకు తినడం, పడుకోవడం తప్పనిసరి. ఈ జీవనశైలిని అతిక్రమిస్తే అనారోగ్యం దాడిచేస్తుంది.

- ఒత్తిడి, ఆందోళనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి కారణమేంటో సమీక్షించుకుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం కాకుంటే నిపుణుల సలహాలూ సహకారం తీసుకోవచ్చు.
- నిరంతరం పనులు చేస్తూ అందరికీ ఆసరాగా ఉండటమే కాదు, మన గురించి మనం పట్టించుకోవాలని మర్చిపోవద్దు. రోజులో కాసేపు ఒంటరిగా, గడిపితే ప్రశాంతత చేకూరుతుంది. ఇది అలసటను పోగొడుతుంది.
- శరీరానికి ఏడు గంటల నిద్ర అవసరం. నిద్ర పట్టకుంటే కాసేపు ధ్యానం చేస్తే సరి.
- ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తున్నప్పటికీ ఏడాదికోసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా అంతర్లీనంగా సమస్య తలెత్తుతున్నట్లు తెలిస్తే అది పెద్దదై బాధ పెట్టకముందే చికిత్స చేయించుకోవచ్చు.