వేసవి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి లస్సీ, పుదీనారసం లాగే చందన షర్బత్ ఉపయోగపడుతోంది. శరీరాన్ని చల్లబరిచి, సేదతీరుస్తుంది.
కావాల్సినవి: గంధం చెక్కు- 30 గ్రా., పంచదార- ఆరు కప్పులు, సిట్రిక్ యాసిడ్- అర టీస్పూన్, శాండల్ ఎసెన్స్ - టేబుల్‌స్పూన్, రోజ్‌వాటర్- టేబుల్‌స్పూన్
తయారీ: గంధం చెక్కును మూడు గ్లాసుల నీళ్లలో ఆరు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత మరో గ్లాసు నీళ్లు పోసి పది నిమిషాల పాటు తక్కువ మంట మీద మూతపెట్టి మరిగించాలి. ఇప్పుడు పలుచని వస్త్రంతో ఈ నీటిని వడకట్టి వెడల్పాటి పాత్రలో పోసుకోవాలి. దీంట్లో పంచదార వేసి నీటిలో కరిగేంతవరకు మరిగించాలి. స్టవ్ మీద నుంచి దించి సిట్రిక్ యాసిడ్, శాండల్ ఎసెన్స్, రోజ్‌వాటర్ వేసి చల్లారనివ్వాలి. దీన్ని గాజుసీసాలో పోసుకుని భద్రపరుచుకోవాలి. మూడు, నాలుగు నెలలపాటు నిల్వ ఉంటుంది. తాగేముందు గ్లాసులో కొన్ని ఐస్‌క్యూబ్స్ వేసుకుని, కొద్దిగా చందన షర్బత్, కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలిపి చల్లగా తాగేయాలి.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల బరిలో 'అందాల రాణి'