ఎంత దూరం: స్టీమర్ ముఖానికి మరీ దగ్గరగా పెడితే ఆవిరి వేడికి ముఖం కమిలిపోతుంది. అందుకనే స్ట్మర్ కాస్త దూరంగా ఉంటేనే మంచిది.
ఎంత సేపు: ఎక్కువ సేపు ఆవిరి పడితే చర్మంలోని నూనె స్రవించే గ్రంథులు పొడిబారిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారి ముడతలు పడే ప్రమాదమూ ఉంటుంది
పట్టిన తర్వాత: ఆవిరి పట్టిన వెంటనే ముఖాన్ని గట్టిగా తుడిచేయకూడదు. మెత్తని వస్త్రంతో సున్నితంగా తుడాలి. ఆవిరి పట్టిన తర్వాత చర్మంలోని నూనె గ్రంధులు ఉండే నూనె బయటకు వచ్చేయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. అలాగాకుండా చర్మం మృదువుగా మారాలంటే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రావాలి