కరోనా వల్ల చాలా మంది డిప్రెషన్, ఆందోళనకు లోనవుతూ అసలు నవ్వడమే మర్చిపోయారు. కనీసం వాళ్లను పనిగట్టుకుని అయినా నవ్వించే ప్రయత్నంలో భాగంగా మరోసారి నవ్వుమీద పరిశీలన చేశారట సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.
హాయిగా నవ్వినా కావాలని నవ్వినా నవ్వు నవ్వే, దీనివల్ల మేలే జరుగుతుంది అని తేల్చారు. ఎందుకంటే ఎలా నవ్వినా ముఖంలో కదిలే కండరాల వల్ల మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్లు విడుదలవుతున్నాయనీ దానివల్ల మనసుకి హాయిగా అనిపిస్తుందనీ వాళ్ల పరిశీలనలో స్పష్టమైందట. అంతేకాదు, దీనివల్ల వాళ్లలో పాజిటివ్‌గా ఆలోచించే గుణం కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో వాళ్లు మానసికంగానే కాదు, శారీరకంగానూ ఆరోగ్యంగానూ ఉంటారని చెప్పుకొస్తున్నారు సదరు పరిశోధకులు.