‘త్వరగా సన్నబడాలి’ అనే లక్ష్యంతో రాజీ తెగ ఎక్సర్‌సైజ్‌లు చేసేస్తోంది. పెళ్లికి ముందు సన్నజాజి తీగలా ఉండే తను బాబు పుట్టాక బాగా లావైంది. భర్త, బంధువులు నవ్వుతూ అంటున్నా.. ఆ మాటలు తనను బాధిస్తున్నాయి. దీంతో తిండి బాగా తగ్గించి, తెగ వ్యాయామాలు చేస్తోంది. కానీ ఫలితం కనిపించట్లేదు. అది మితిమీరిన తీరుకు చిహ్నమంటున్నారు నిపుణులు..
గంటల తరబడి కసరత్తులు చేస్తే...
త్వరితగతిన ఫలితం పేరిట గంటల తరబడి కసరత్తులు, తిండిని పక్కన పెట్టేయడం.. ఒత్తిడితోపాటు అలసట, వ్యాధి నిరోధకశక్తిలో తగ్గుదలకు కారణమవుతాయి. బాగా అలసిపోవడం, రోజంతా నీరసంగా ఉండటం, కీళ్ల నొప్పులు, ఎంత వ్యాయామం చేసినా ఫలితం రాకపోవడం వంటివీ ఈ ‘అతి’కి సూచనలే.
కాబట్టి.. రోజుకు 30- 45 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే చాలు. నేషనల్ హెల్త్ పోర్టల్ ప్రకారం.. 18-64 ఏళ్లలోపు వారెవరైనా వారానికి 150 నిమిషాలు మాత్రమే తేలిక, మధ్యస్థ వ్యాయామాలను చేయాలట. కఠినమైనవైతే అది వారానికి 75 నిమిషాలు మాత్రమే. అంతేకాదు.. శరీర బరువు, తత్వం ఆధారంగా ఏది తగినదో తెలుసుకున్నాకే ప్రారంభించాలి. అలాగే.. రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులతోపాటు విటమిన్ డి3, బి12, మెగ్నీషియం, ఐరన్‌లను తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం పూర్తయ్యాక స్ట్రెచింగ్, నీటిని బాగా తీసుకోవడం, విశ్రాంతి, బలవర్థకమైన ఆహారానికీ ప్రాధాన్యమిస్తే ఫలితం తప్పక కనిపిస్తుంది.
ఇదీ చూడండి: వ్యాయామం చేస్తున్నారా?.. ఇవి తినడం మరవకండి!
ఇదీ చూడండి: EXERCISES: ఫిట్నెస్ ముఖ్యమే కానీ.. అతిగా చేసినా ప్రమాదమే!
ఇదీ చూడండి: యుక్తవయసులో వ్యాయామం.. ఎన్నో లాభాలు!