వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుందనీ, ఆరోగ్యాన్నీ, అందాన్నీ పెంచుతుందన్న మాట నిజమే. కానీ తక్కువ సమయంలోనే ఆ ప్రయోజనాలన్నీ అందాలనుకుంటే మాత్రం అనారోగ్యాల ముప్పు తప్పదు. ఎందుకంటే అతిగా చేసే కసరత్తుల వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఫలితంగా మనసుతో పాటు శరీరం కూడా అలసిపోతుంది.
- మితిమీరి చేసే కసరత్తుల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఆకలి పెరిగి అధిక బరువుకి కారణం అవుతుంది. నెలసరీ క్రమం తప్పొచ్చు. ముఖ్యంగా ఈస్టోజ్రెన్ హార్మోన్ స్థాయులు పడిపోయి ఆస్టియోపొరోసిస్‌కు దారితీసే అవకాశం ఉందంటారు వైద్యులు.
- వర్కవుట్స్ మితిమీరితే ఒత్తిడి తగ్గడానికి బదులు మరింతగా పెరుగుతుందట! ఇందుకు కారణం అధిక వ్యాయామం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా విడుదలవడమే! తద్వారా మనసుతో పాటు శరీరం కూడా అలసిపోతుంది. అందుకే రోజూ అరగంట నుంచి నలభై నిమిషాల పాటు వ్యాయామాలకు కేటాయిస్తే చాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఏడెనిమిది గంటల సుఖ నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు.
- అధికంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తద్వారా ‘అనొరెక్సియా’ అనే సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ఆకలి పెరగడం, తీసుకునే ఆహారం విషయంలో అడ్డూ-అదుపూ ఉండకపోవడం, నచ్చిన పదార్థాలు మోతాదుకు మించి లాగించడం.. వంటివి చేస్తాం.
- వ్యాయామాల పేరుతో శరీరాన్ని అతిగా కష్టపెట్టడం వల్ల దాని ప్రభావం జీవక్రియల మీద కూడా పడుతుందట! ఫలితంగా రక్తహీనత తలెత్తడంతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.
- అధిక వ్యాయామాల వల్ల శరీరం చురుగ్గా మారడమేమో గానీ మరింతగా అలసిపోయే ప్రమాదం ఉందట! అలాగే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి.. వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుందట! పైగా ఇలాంటి నొప్పులొస్తే ఓ పట్టాన తగ్గవు.
- అతిగా వ్యాయామాలు చేయడం వల్ల అమెనోరియా బారిన పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా నెలసరి ఆగిపోవడం లేదంటే క్రమం తప్పడం.. వంటివి జరుగుతాయి. ఇదిలాగే కొనసాగితే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు పడిపోయి ఆస్టియోపొరోసిస్‌కు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే నిపుణుల సూచనల మేరకే నిర్ణీత సమయాన్ని వ్యాయామాలకు కేటాయించాల్సి ఉంటుంది.
వీటితో పాటు అధిక వ్యాయామాల వల్ల గుండె ఆరోగ్యం, శ్వాస వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి రోజూ అరగంట పాటు వర్కవుట్స్‌కు కేటాయించమని, ఈ క్రమంలో ఏవైనా అనారోగ్యాలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించమని సలహా ఇస్తున్నారు.
ఇదీ చూడండి: వ్యాయామం అలవాటు లేదా?- కొవిడ్ ముప్పు ఎక్కువే!