ETV Bharat / lifestyle

DONATE ORGANS: అవయవాల మార్పిడి కోసం బాధితుల ఎదురుచూపులు - అవయవాల దానం

బతకాలనే ఆశతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. అనారోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మొండిగా జీవిస్తున్నారు అవయవాల కోసం వేచిచూసే బాధితులు. సకాలంలో అవయవ మార్పిడి పొందలేక అర్థాంతరంగా కన్నుమూస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బ్రెయిన్‌డెడ్‌ బాధితుల నుంచి అవయవాలను సేకరించేందుకు సంబంధిత కుటుంబాలు సమ్మతించేలా పెద్దఎత్తున అవగాహన చేపట్టాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. రక్తసంబంధీకులు, సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాల్సిన తరుణమిదేనని స్పష్టం చేస్తున్నారు.

DONATE ORGANS
అవయవ దానం
author img

By

Published : Aug 12, 2021, 12:21 PM IST

హైదరాబాద్‌కు చెందిన గూట్ల శ్రీకాంత్‌(36) నాలుగేళ్లుగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నాడు. దానం చేయడానికి తన భార్య ముందుకొచ్చినా బ్లడ్‌గ్రూపు కలవలేదు. దీంతో జీవన్మృతుడి నుంచి సేకరించే కిడ్నీని పొందడానికి జీవనదాన్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. తన ముందు మరో 70 మంది ఇలా వేచి చూస్తున్నారని శ్రీకాంత్‌ ఆవేదన వెలిబుచ్చారు. ఈఎస్‌ఐ పథకంలో భాగంగా ప్రస్తుతం ఉచితంగా డయాలసిస్‌ పొందుతుండడం కొంత ఊరటనిస్తున్నా.. మందుల ఖర్చు భరించలేకపోతున్నామని, ప్రభుత్వం నుంచి కిడ్నీ బాధితులకు నెలానెలా పింఛను అందించి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లా నందిపేటకు చెందిన జక్కని మల్లేశ్‌(39)కు 2017లో మూత్రపిండాలు పాడైపోయాయి. స్థానిక సాయిబాబా ఆలయంలో సేవలందిస్తూ... భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడి ఆశ్రయంలోనే నివాసముంటున్నాడు. 2017 డిసెంబరులోనే జీవన్‌దాన్‌లో తన పేరును నమోదు చేసుకొని ఎదురుచూస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా రక్తశుద్ధి చికిత్స పొందుతుండడంతో కొంత ఆర్థిక భారం తప్పిందని, అయినా మందుల కోసం నెలనెలా రూ.10వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన వాపోతున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే మూత్రపిండాల మార్పిడి కోసం జీవన్‌దాన్‌ ట్రస్టు వద్ద 1,733 మంది నమోదవ్వగా.. మొత్తంగా 2,467 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గరిష్ఠంగా 500కు మించి జరగడం లేదు. ఒక్క మూత్రపిండాల వైఫల్యం వల్ల రక్తశుద్ధి కొత్తగా అవసరమవుతున్న బాధితులు ఏటా 4-5వేల మంది నమోదవుతుండగా.. వీరిలో సమయానుకూలంగా అవయవం లభించక.. ఇతర ఇన్‌ఫెక్షన్ల బారినపడి ఏటా సుమారు 3 వేల మంది మరణిస్తుండటం ఆందోళన కలిగించే అంశమే. ఇటువంటి పరిస్థితుల్లో జీవన్మృతులైన(బ్రెయిన్‌డెడ్‌) బాధితుల నుంచి అవయవాలను సేకరించేందుకు సంబంధిత కుటుంబాలు సమ్మతించేలా పెద్దఎత్తున అవగాహన చేపట్టాల్సిన అవసరముందని, రక్తసంబంధీకులు, సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాల్సిన తరుణమిదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పారదర్శకంగానే అవయవదానం

కొవిడ్‌ ఉధ్ధృతి సమయంలోనూ జీవన్మృతుల నుంచి అవయవాల సేకరణ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లోనే బాధితులకు వరుస క్రమంలో అవయవాలను కేటాయిస్తుంటారు. వరుసలో పేరును ముందుగా నమోదు చేసుకున్నా.. అవయవాన్ని దానం చేసే వ్యక్తి బ్లడ్‌గ్రూపునకు.. స్వీకరించే బాధితుడి గ్రూపు మ్యాచ్‌ అవ్వాలి. ఉదాహరణకు 25వ నంబరుపై ‘బి’ పాజిటివ్‌ వక్తి కిడ్నీ కోసం నమోదు చేసుకున్నాడనుకుందాం.. అవయవదాత బ్లడ్‌గ్రూపు ‘ఒ’ పాజిటివ్‌ అయితే.. అప్పుడు 25వ నంబరు బాధితుడికి కిడ్నీని ఇవ్వరు. ఆ క్రమంలో ‘ఒ’ పాజిటివ్‌ గ్రూపున్న బాధితుడికి కేటాయిస్తారు. ఇలా బ్లడ్‌గ్రూపు మ్యాచ్‌ అవడాన్ని బట్టి వరుస క్రమంలో బాధితులకు వెనుకా ముందు అందుతుంటాయి. అంతా పారదర్శకంగా జరుగుతుంది.

-డాక్టర్‌ స్వర్ణలత, జీవన్‌దాన్‌ ట్రస్టు ఇన్‌ఛార్జి

అవయవ దానం చేస్తే తమ ఆరోగ్యం దెబ్బతింటుందో ఏమో అనే అపోహలతో కుటుంబ సభ్యులు వెనుకంజ వేస్తుండటంతో అనివార్యంగా అత్యధికులు జీవన్మృతుల అవయవాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే దీన్ని కూడా కొన్ని ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటూ అక్రమాలకు తెరతీసిన దాఖలాలు గతంలో వెలుగుచూడడంతో.. దీన్ని చక్కదిద్దేందుకు 2013లో ‘జీవన్‌దాన్‌’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జీవన్మృతుడైన వ్యక్తి ఉన్నా.. వెంటనే సమాచారాన్ని జీవన్‌దాన్‌ ట్రస్టుకు చేరవేయాల్సి ఉంటుంది. అయినా ఆశించిన స్థాయిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం లేదు.

జీవన్​దాన్​ పథకం

ఎవరు జీవన్మృతుడు?

మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పనిచేయడం ఆగిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో బ్రెయిన్‌డెడ్‌ అంటారు. ఇది రోడ్డు ప్రమాదాల్లో గానీ, అధిక రక్తపోటు కారణంగా కూడా జరగొచ్చు. ప్రతి ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌/డైరెక్టర్‌, రోగికి చికిత్స చేస్తున్న ప్రధాన వైద్యుడు, న్యూరాలజిస్ట్‌/న్యూరోసర్జన్‌, చికిత్సతో సంబంధం లేని మరో వైద్యనిపుణుడితో కూడిన నలుగురు సభ్యుల బృందం జీవన్మృతుడుని నిర్ధారిస్తుంది. బాధితుడి కుటుంబ సభ్యులు ఒప్పుకున్న అనంతరమే అవయవాల సేకరణ మొదలవుతుంది. జీవన్మృతుడి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయాన్ని అందించరు.

వివరాలు

నిమ్స్‌ ముందంజ

ప్రభుత్వ వైద్యంలో పరిశీలిస్తే.. అవయవ మార్పిడిల్లో నిమ్స్‌ ముందంజలో ఉంది. 2013 నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ 21 మంది జీవన్మృతులు అవయవాలను దానంగా ఇవ్వగా 267 కిడ్నీలు, 11 కాలేయాలు, 5 గుండె మార్పిడి శస్త్రచికిత్సలతో మొత్తంగా 283 అవయవమార్పిడిలు చేశారు. ఉస్మానియాలో గత 8 ఏళ్లలో 62 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా.. గాంధీలో కేవలం 8 మాత్రమే చేశారు.

ఇదీ చూడండి: అమెరికాలో కరోనా ఉగ్రరూపం- చైనాలో ఇళ్లకు తాళాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.