ETV Bharat / lifestyle

'ఇంటి నుంచే కరోనా మహమ్మారిని జయించండి'

కరోనా బారిన పడిన వారికి అందిస్తున్న టెలీ వైద్య సేవలను జూన్​ 15 వరకు పొడిగిస్తున్నట్లు హెల్పర్ ఫౌండేషన్ సీవోవో డాక్టర్ అనూప్ వెల్లడించారు. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్ర వైద్యులు కొవిడ్ బాధితులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశిత సమయాల్లో బాధితులు ఎవరైనా సరే జూమ్‌ కాల్‌ ద్వారా సేవలు పొందవచ్చని చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏపీలోని అమరావతిలో ఉండే కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు.

author img

By

Published : May 24, 2021, 7:57 AM IST

NRI doctors instructions to covid patients
ప్రవాసాంధ్ర వైద్యుల టెలీ మెడిసిన్ సేవలు

కరోనా బారిన పడినవారు ఇంటి నుంచే దాన్ని జయించేందుకు వీలుగా ఇప్పటికే అందిస్తున్న టెలీ వైద్యసేవల్ని జూన్‌ 15 వరకూ పొడిగిస్తున్నట్లు హెల్పర్‌ ఫౌండేషన్‌ సీవోవో డా.అనూప్‌ తెలిపారు. అమెరికాలోని ప్రవాసాంధ్ర వైద్యులైన జనరల్‌ ఫిజీషియన్లు డా.హిమబిందు, డా.హరీష్‌, డా.ధీరజ్‌, డా.భానుప్రకాశ్‌, డా.సురేష్‌, డా.అచ్యుత్‌, పల్మనాలజిస్ట్‌ డా.విఖ్యాత్‌, ఎండోక్రైనాలజిస్ట్‌ డా.సుధ, సాంక్రమిక వ్యాధుల నిపుణురాలు డా.సుభద్రలు కొవిడ్‌ బాధితులకు అవసరమైన టెలీ వైద్యం, సూచనలు, సలహాలు అందిస్తారని వివరించారు. నిర్దేశిత సమయాల్లో బాధితులు ఎవరైనా సరే జూమ్‌ కాల్‌ ద్వారా సేవలు పొందవచ్చని చెప్పారు. గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, లాస్‌ఏంజిల్స్‌ తెలుగు అసోసియేషన్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

టెలీవైద్యసేవలు అందుబాటులో ఉండే తేదీలు, సమయాలు
* మే 24 నుంచి 28 వరకూ, జూన్‌ 1, 8, 10, 15 తేదీల్లో సాయంత్రం 6.30 గంటలకు
* మే 31, జూన్‌ 6, 8, 10, 12 తేదీల్లో ఉదయం 7 గంటలకు
* జూన్‌ 3, 4, 5, తేదీల్లో ఉదయం 8 గంటలకు
* మే 29న రాత్రి 8.30 గంటలకు
* జూన్‌ 12, 13, 14 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు

జూమ్‌ మీటింగ్‌ వివరాలు
* పైన పేర్కొన్న సమయానికి అరగంట ముందు జూమ్‌ కాల్‌లో చేరాలి
* జూమ్‌ మీటింగ్‌ ఐడీ: 84822674447
* పాస్‌వర్డ్​: helper
* హెల్పర్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ను తెరిచి ప్రాజెక్ట్స్‌ విభాగంలోకి వెళ్తే టెలీహెల్త్‌ క్లినిక్‌ అనే ఉప విభాగం ఉంటుంది. అందులోని రిసోర్సెస్‌ విభాగంలోకి వెళ్తే ఓ దరఖాస్తు కనిపిస్తుంది. అందులో వివరాలు నమోదు చేసుకోవచ్చు. టెలీగ్రామ్‌ లింక్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి ఆ గ్రూపులో చేరి సందేహాల్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: పల్లె బతుకులు ఆగం.. కరోనా పరీక్షలు చేయక వేగంగా వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.