ETV Bharat / state

పెట్టుబడులొస్తున్నాయ్ - తెలంగాణ యువత జాబ్​లకు ఇక ఢోకా లేదు! - Investment flow to the state

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న 24 భారీ పరిశ్రమలు - యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు

Investment Flow To The State
Investment Flow To The State (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 1:29 PM IST

Updated : Oct 6, 2024, 1:53 PM IST

Investment Flow To The State : రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా వీటిలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తమకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయా సంస్థల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. టీ-ఐడియాలో మెగా ప్రాజెక్టు హోదా కింద వీటి రాయితీల ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి, సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం పరిశ్రమల యజమానులను ఆహ్వానించింది. భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ మేరకు ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. ఫలితంగా పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. దీంతో అవి కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించినట్లయితే అవి కార్యరూపం దాల్చుతాయి.

Investment Flow To The State
పెట్టుబడులొస్తున్నాయ్ - తెలంగాణ యువత జాబ్​లకు ఇక ఢోకా లేదు! (ETV Bharat)

పరిశ్రమవర్గాల దరఖాస్తులు : పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు చేసిన వాటిలో ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రం పరిధిలో కమలాపురంలో మూతపడిన కాగితం మిల్లు స్థానంలో 2.50 లక్షల టన్నుల సామర్థ్యంతో పేపర్‌ బోర్డు మిల్లును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్‌ (ఫ్యాబ్‌) సిటీలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 75 ఎకరాల్లో 4 గిగావాట్ల పీవీ టాప్‌కాన్‌ సెల్, మాడ్యూల్స్, 14.86 ఎకరాల్లో 1 గిగావాట్‌ సోలార్‌ పీవీ మాడ్యూళ్లు, 19.06 ఎకరాల్లో రూ.700 కోట్ల పెట్టుబడితో 1033 మెగావాట్ల సోలార్‌ పీవీ సెల్, 1014 సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ పరిశ్రమలు ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దివిటిపల్లి ఎనర్జీ పార్క్‌లో 20 ఎకరాల్లో లోహం మెటీరియల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ క్రిటికల్‌ మెటీరియల్స్‌ రీసైక్లింగ్, రిఫైనింగ్, ప్రాసెసింగ్‌ పరిశ్రమ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఏరో స్పేస్‌ సెజ్‌లో విమానాల విడి భాగాల అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశాయి.

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న యాజమాన్యాలు : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో డెక్కన్‌ సిమెంట్స్‌ లిమిటెడ్‌ సంస్థ తమ సిమెంట్‌ పరిశ్రమ విస్తరణకు దరఖాస్తు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం గోవిందాపూర్‌ గ్రామంలో హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ చాక్లెట్ల తయారీ పరిశ్రమ, పాలశుద్ధి కేంద్రం, 25 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సుముఖతను వ్యక్తంచేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో జెమిని ఎడిబుల్స్, మహేశ్వరం ఎలక్ట్రానిక్‌ సిటీలో రెన్యూసిస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ సోలార్‌ పీవీ మాడ్యుల్‌ లైన్స్‌ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎఫ్‌ ఇండియా) సంస్థ నూనెల శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేశాయి.

Investment Flow To The State
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ (Investment Flow To The State)

Industrial Development In TG : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో కందవాడలో స్పిన్‌మాక్స్‌ టైర్స్‌ అనే ఓ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ నాలుగు చక్రాల వాహనాల టైర్ల తయారీ యూనిట్, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో మహారాష్ట్ర సీమ్‌లెస్‌ లిమిటెడ్‌ సంస్థ పైపుల మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీ, మహేశ్వరం ఎలక్ట్రానిక్‌ సిటీలో లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థ కళ్లద్దాల తయారీ పరిశ్రమను, సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని ఫుడ్​ ప్రాసెసింగ్ ప్రత్యేకమండలిలో మయోరా ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ చాక్లెట్లు, బిస్కట్ల తయారీ కేంద్రాన్ని, ఆర్‌ఎంజే వెరిటబుల్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఫుడ్​ ప్రాసెసింగ్ పరిశ్రమ, మానె ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

మనోహరాబాద్​లో ఐటీసీ ఫుడ్​ప్రాసెసింగ్ పరిశ్రమ : సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం కర్కపట్లలోని బయోటెక్‌ పార్క్‌-3లో సిరో ఫార్మా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ క్యాన్సర్​ మహామ్మారిని నిర్మూలన ఔషధాల తయారీ, మెదక్‌ జిల్లా నందికంటిలో బ్లూక్రాప్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బీఏపీఎల్‌) మొక్కజొన్న ఉత్పత్తులు, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గుంతపల్లిలో మోనిన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ పండ్ల గుజ్జు, రసాల తయారీ పరిశ్రమ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పారిశ్రామిక పార్క్‌లో మలబార్‌ గోల్డ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ కేంద్రం, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం శ్రీనగర్‌ గ్రామంలో మైహోం ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ భారీ సిమెంట్‌ కర్మాగారం, మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో ఐటీసీ ఫుడ్‌ డివిజన్‌ సంస్థ భారీ ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్నాయి.

సంస్థలు కోరుతున్నవి ఏంటంటే

  • మెగా ప్రాజెక్టు కింద మూలధన పెట్టుబడిలో 30 శాతం రాయితీని
  • భూ కేటాయింపులు ఒక వేళ సంస్థే భూములు కొనుగోలు చేస్తే అందులో 25 శాతం చెల్లింపు
  • 100 శాతం స్టాంపు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలు, రిజిస్ట్రేషన్‌ రుసుం మినహాయింపు
  • పవర్​ సబ్సిడీ, వడ్డీ రాయితీ, స్కిల్​ ట్రైనింగ్​ రాయితీలను సంస్థలు కోరాయి.

ఐటీసీ సంస్థ కమలాపురం వద్ద పరిశ్రమకు 1.25 లక్షల ఎకరాల్లో మొక్కల పెంపకానికి అనుమతించాలని ప్రత్యేకంగా ప్రభుత్వానికి అభ్యర్థించింది.

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం - పరిశ్రమ పెట్టాలంటే ఇక స్థలం కొనక్కర్లేదు! - MSME Encourage Policy in Telangana

త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం - తమదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో కొత్త ప్రభుత్వం

Last Updated : Oct 6, 2024, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.