ETV Bharat / business

మీకు అడ్వెంచర్‌ బైక్స్ అంటే ఇష్టమా? ఈ టాప్‌-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి! - Best Adventure Motorcycles - BEST ADVENTURE MOTORCYCLES

Best Adventure Motorcycles : మీకు అడ్వెంచర్‌ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్‌-10 అడ్వెంచర్ మోటార్‌ సైకిల్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

The Best off-road Motorcycles
The Best Adventure Motorcycles (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 1:26 PM IST

Best Adventure Motorcycles : మీకు అడ్వెంచర్‌ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? కొండలు, కోనలు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా ప్రతిచోటకూ బైక్‌పై వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్‌-10 అడ్వెంచర్ మోటార్‌ సైకిల్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

మనం టీవీల్లో చూస్తుంటాం. కొంత మంది బైక్‌ రైడ్‌ చేస్తూ కొండలను ఎక్కేస్తుంటారు. లేదా చిత్తడిగా ఉన్న నేలలో కూడా ఈజీగా బండి నడిపేస్తుంటారు. చిన్నచిన్న వాగులు, వంకలను కూడా సునాయాసంగా దాటేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర ఉన్న సాధారణ మోటార్‌ సైకిళ్లతో ఇలా చేయడం కుదరదు. ఇలాంటి ఫీట్స్ చేయాలంటే, అడ్వెంటర్ మోటార్ సైకిళ్లను వాడాల్సిందే. అందుకే ఈ ఆర్టికల్‌లో టాప్‌-10 అడ్వెంటర్‌ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం.

1. Honda CRF300 Rally : ఈ హోండా మోటార్‌ సైకిల్‌లో 286 సీసీ సింగిల్ సిలిండర్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది 27 bhp పవర్‌, 26.6 ft-lb (ఫుట్‌ పౌండ్‌ ఫోర్స్‌) జనరేట్ చేస్తుంది. దీనిలో 12.8 లీటర్ సామర్థ్యం గల ట్యాంక్ ఉంటుంది.

  • సీట్ హైట్‌ - 885 mm
  • బరువు - 153 కేజీ
  • టైర్స్‌ - 21/18
  • సస్పెన్షన్ - ముందు వైపు 43 mm యూఎస్‌డీ ఫోర్క్స్‌ నాన్‌-అడ్జ్‌, వెనుక మోనోషాక్‌ ప్రీలోడ్‌ అడ్జ్‌ సస్పెన్షన్‌ ఉంటుంది.

ఈ ఆఫ్‌-రోడ్ బైక్‌తో చాలా లాంగ్ రేంజ్‌ వరకు సునాయాసంగా ప్రయాణించవచ్చు. దీని సీటు విశాలంగా ఉంటుంది. కనుక కూర్చోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇంకా దీనిలో చాలా స్ట్రాంగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

Honda CRF300 Rally Price : ఈ బైక్‌ రూ.5,00,000 - రూ.5,20,000 ప్రైస్‌ రేంజ్‌లో ఉంటుంది.

2. Royal Enfield Himalayan 410 : యూత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బైక్‌లో 411 సీసీ సింగిల్-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్ అమర్చారు. ఇది 24 bhp, 23.6 ft-lb (ఫుట్‌ పౌండ్‌ ఫోర్స్‌) జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 15 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. కాస్త తక్కువ ధరలో మంచి అడ్వెంచర్‌ బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

  • సీట్ హైట్‌ - 800 mm
  • బరువు - 185 కేజీ
  • టైర్స్‌ - 21/17
  • సస్పెన్షన్ - ముందు వైపు 41 mm ఫోర్క్స్‌, వెనుక మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉంటుంది.

Royal Enfield Himalayan 410 Price : మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.2.16 లక్షల నుంచి రూ.2.29 లక్షల వరకు ఉంటుంది.

3. Royal Enfield Himalayan 450 : ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ 450 బైక్‌లో 452 సీసీ సింగిల్-సిలిండర్‌, లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్ అమర్చారు. ఇది 38 bhp, 29.5 ft-lb (ఫుట్‌ పౌండ్‌ ఫోర్స్‌) జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 17 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 450లో స్లిప్‌-అసిస్ట్ క్లచ్‌, 6 గేర్స్‌ ఉంటాయి.

  • సీట్ హైట్‌ - 825-845 mm
  • బరువు - 196 కేజీ
  • టైర్స్‌ - 21/17
  • సస్పెన్షన్ - ముందు వైపు 43 mm యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుక షోవా మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉంటుంది.

Royal Enfield Himalayan 450 Price :ఈ బైక్‌ ధర సుమారుగా రూ.2.85 లక్షల - రూ.2.98 లక్షలు ఉంటుంది.

4. AJP PR7 Adventure 650 : ఏజేపీ పీఆర్‌7 అడ్వెంచర్‌ 650 బైక్‌లో 600 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్ ఉంటుంది. ఇది 48 bhp పవర్‌, 42.8 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 17 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. బురద నేలల్లో రైడ్ చేయాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

  • సీట్ హైట్‌ - 920 mm
  • బరువు - 165 కేజీ
  • టైర్స్‌ - 21/18
  • సస్పెన్షన్ - ముందు వైపు ఫుల్లీ అడ్జెస్టబుల్‌ 48 mm యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుక వైపు ఫుల్లీ అడ్జెస్టబుల్‌ ఫోర్క్స్‌ ఉంటాయి.

AJP PR7 Adventure 650 Price : ఈ బైక్ ధర సుమారుగా రూ.11,25,000 నుంచి రూ.15,44,000 వరకు ఉంటుంది.

5. Honda CB500X : ఈ హోండా సీబీ500 ఎక్స్‌ బైక్‌లో 471 సీసీ ప్యారలల్-ట్విన్ సిలిండర్‌ ఉంటుంది. ఇది 47 bhp పవర్‌, 31.7 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 17.7 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. మొదటిసారి అడ్వెంచర్‌ బైక్‌ కొనాలని ఆశిస్తున్నవారికి ఈ హోండా సీబీ500 ఎక్స్‌ మంచి ఆప్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు.

  • సీట్ హైట్‌ - 830 mm
  • బరువు - 199 కేజీ
  • టైర్స్‌ - 19/17
  • సస్పెన్షన్ - ముందు వైపు ప్రీలోడ్‌ అడ్జెస్టబుల్‌ 41 mm యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుక వైపు ప్రీలోడ్ అడ్జెస్టబుల్‌ మోనోషాక్‌ ఫోర్క్స్‌ ఉంటాయి.

Honda CB500X Price : ఈ బైక్ ధర రూ.5,79,952 వరకు ఉంటుంది.

6. Yamaha Tenere 700 : ఈ యమహా టెనెరే 700 బైక్‌లో 689 సీసీ ప్యారలల్‌-ట్విన్ ఇంజిన్‌ ఉంది. ఇది 72 bhp పవర్‌, 50 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) జనరేట్‌ చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 16 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. దీనిలో హెవీ డ్యూటీ బ్రేక్స్ ఉంటాయి.

  • సీట్ హైట్‌ - 880 mm
  • బరువు - 205 కేజీ
  • టైర్స్‌ - 21/18
  • సస్పెన్షన్ - ముందు వైపు ప్రీలోడ్‌ అడ్జెస్టబుల్‌ 43 mm కేవైబీ యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుక వైపు సాక్స్‌ మోనోషాక్‌ ఉంటుంది.

Yamaha Tenere 700 Price : ఈ బైక్‌ ధర సుమారుగా రూ.13 లక్షలు - రూ.14 లక్షలు వరకు ఉంటుంది.

7. Triumph Tiger 900 Rally : ఈ ట్రయంఫ్‌ టైగర్‌ 900 ర్యాలీ బైక్‌లో 888 సీసీ ఇన్‌-లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ ఉంది. ఇది 106.5 bhp పవర్‌, 66.38 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) జనరేట్‌ చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 20 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

  • సీట్ హైట్‌ - 830 mm
  • బరువు - 220 కేజీ
  • టైర్స్‌ - 19/17
  • సస్పెన్షన్ - ముందు వైపు 45 mm మార్జేచి యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుక వైపు మార్జోచీ -ప్రీలోడ్‌ అండ్ రీబౌండ్‌ అడ్జస్టబుల్‌ సస్పెన్షన్‌ ఉంటుంది.

Triumph Tiger 900 Rally Price : ఈ బైక్ ధర సుమారుగా రూ.14,15,000 నుంచి రూ.16,25,000 వరకు ఉంటుంది.

8. Suzuki V-Strom 650XT : సుజుకి వీ-స్ట్రోమ్ 650ఎక్స్‌టీ బైక్‌లో 645 సీసీ వీ-టిన్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 71 bhp పవర్‌, 45 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) జనరేట్‌ చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 20 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్‌లో ప్రత్యేకంగా లగేజ్ ర్యాక్స్‌, క్రాష్ ప్రొటెక్షన్‌ సిస్టమ్ ఉంటుంది. కనుక అడ్వెంచర్‌ ట్రావెలింగ్ చేసేవారికి ఇది చాలా బాగుంటుంది.

  • సీట్ హైట్‌ - 830 mm
  • బరువు - 216 కేజీ
  • టైర్స్‌ - 21/18
  • సస్పెన్షన్ - ముందు వైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుక వైపు మోనోషాక్ ప్రీలోడ్‌ అడ్జెస్టబుల్‌ సస్పెన్షన్ ఉంటుంది.

Suzuki V-Strom 650XT Price : ఈ బైక్‌ ధర సుమారుగా రూ.8,93,000 వరకు ఉంటుంది.

9. KTM 890 Adventure : ఈ కేటీఎం 890 అడ్వెంచర్‌ మోటార్ సైకిల్‌లో 889 సీసీ ప్యారలల్‌-టిన్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 104 bhp పవర్‌, 73.8 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) జనరేట్‌ చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 20 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

  • సీట్ హైట్‌ - 880 mm
  • బరువు - 210 కేజీ
  • టైర్స్‌ - 21/18
  • సస్పెన్షన్ - ముందు వైపు ఫుల్లీ ఎడ్జెస్టబుల్‌ 48 mm WP XPLOR ఫోర్క్స్‌, వెనుక వైపు ఫుల్లీ ఎడ్జెస్టబుల్‌ WP XPLOR షాక్‌ సస్పెన్షన్ ఉంటుంది.

KTM 890 Adventure Price : ఈ బైక్ ధర సుమారుగా రూ.11.50 లక్షల వరకు ఉంటుంది.

10. BMW F850GS Adventure : ఈ బీఎండబ్ల్యూ బైక్‌లో 853 సీసీ ప్యారలల్‌-టిన్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 94 bhp పవర్‌, 68 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్‌) జనరేట్‌ చేస్తుంది. ఈ ఆఫ్‌-రోడ్ మోటార్ సైకిల్‌లో 15 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్‌ మంచి సస్పెన్షన్‌ కలిగి ఉంటుంది. కనుక ఈ యూజర్‌ ఫ్రెండ్లీ బైక్‌తో కొండలపై, గతుకుల రోడ్లపై కూడా దర్జాగా డ్రైవ్‌ చేస్తూ వెళ్లిపోవచ్చు.

  • సీట్ హైట్‌ - 835 mm
  • బరువు - 229 కేజీ
  • టైర్స్‌ - 21/17
  • సస్పెన్షన్ - ముందు వైపు ఫుల్లీ ఎడ్జెస్టబుల్‌ 43 mm యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుక వైపు ప్రీలోడ్‌ అండ్ రీబౌండ్ అడ్జెస్టబుల్‌ సింగిల్ షాక్ ఉంటుంది.

BMW F850GS Adventure Price : ఈ బైక్ ధర సుమారుగా రూ.13.75 లక్షల వరకు ఉంటుంది.

నోట్‌ : ఈ అడ్వెంచర్‌ బైక్‌ల ధరలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. పైగా వీటికి మీరు అదనపు ఫిట్టింగ్స్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కనుక వీటి ధరలు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా వీటి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని బిగినర్స్ వాడడం చాలా కష్టమవుతుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తరువాత మాత్రమే వీటిని నడపడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.