ETV Bharat / lifestyle

ఇలా స్నానం చేస్తే తాజాదనం సొంతం!

ప్రస్తుతం అడుగు బయటపెడితే చాలు.. సూర్యుడు నడినెత్తిన తాండవం చేస్తున్నాడు. అధిక వేడి, ఉక్కపోత, చెమట.. వీటన్నిటి కారణంగా రోజు ముగిసే సరికి అలసిపోవడం ఖాయం. మరి, ఆ అలసటను దూరం చేసుకొని తిరిగి ఉత్సాహాన్ని పొందాలంటే ఏం చేయాలి?? దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తూ స్నానం చేస్తే సరిపోతుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలేంటి? వాటి వల్ల మనకు కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

natural-bath-soal-ideas-for-summer
ఇలా స్నానం చేస్తే తాజాదనం సొంతం!
author img

By

Published : Apr 20, 2021, 1:08 PM IST

అలసిన చర్మానికి సాంత్వన చేకూర్చి తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే గుణాలు కొన్ని సహజసిద్ధమైన పదార్థాల్లో మెండుగా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే చెమట, అలసటకు చెక్ పెట్టడమే కాదు.. తిరిగి ఉత్సాహవంతంగా మారడం అంత కష్టమేం కాదంటున్నారు సౌందర్య నిపుణులు.

కీరాదోస గుజ్జుతో..

naturalbathghgh650-2.jpg
కీరాదోసతో

కావాల్సినవి:
* కీరాదోస (పెద్దది)- 1
* ఎప్సం సాల్ట్- 2 కప్పులు
* పెప్పర్‌మింట్ టీ బ్యాగ్స్- 5
ముందుగా కీరాదోస తొక్క చెక్కేసి ముక్కలుగా కోసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ఒక మెత్తని వస్త్రంలో వేసి దాని నుంచి వచ్చే రసాన్ని స్నానానికి సిద్ధం చేసుకున్న బకెట్ నీళ్లలో వేసుకోవాలి. తర్వాత ఒక మగ్గు నీళ్లు తీసుకొని అందులో రెండు కప్పుల ఎప్సం సాల్ట్, పెప్పర్‌మింట్ టీ బ్యాగ్స్ వేసి బాగా మరిగించాలి. అలా నీటిస్థాయి సగం అయ్యే వరకు మరిగించి ఆ నీటిని కూడా బకెట్‌లో ఉన్న నీళ్లలో కలుపుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ఆ నీటితో స్నానం చేస్తే అలసిన చర్మం తిరిగి తాజాగా మారడమే కాదు.. మనలో కొత్త ఉత్సాహం జనిస్తుంది.
ఆసక్తి ఉన్నవారు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను కూడా ఇందులో భాగం చేసుకోవచ్చు. ఫలితంగా పరిమళభరితంగా మారచ్చు.

యాపిల్ సిడర్ వెనిగర్‌తో..

naturalbathghgh650-6.jpg
యాపిల్ సైడర్ వెనిగర్

స్నానం చేసే నీళ్లలో రెండు కప్పుల యాపిల్ సిడర్ వెనిగర్ కలపండి. బాత్‌టబ్‌లో స్నానం చేసేటట్లయితే ఆ నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలపాటు శరీరం మునిగి ఉండేలా చేస్తే చాలు.. సూర్యరశ్మి కారణంగా కమిలిపోయిన చర్మం తిరిగి తాజాగా మారడంతోపాటు అలసట కూడా దూరమవుతుంది. అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ చర్మం పైపొరల్లో పేరుకుపోయిన మలినాలు, మృతకణాలను తొలగించి తిరిగి మేను ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

నిమ్మరసం, రోజ్‌వాటర్‌తో..

naturalbathghgh650-5.jpg
గులాబీ రేకులతో

కావాల్సినవి:
* నిమ్మరసం- అరకప్పు
* రోజ్‌వాటర్- 5 చెంచాలు
స్నానం చేసే నీళ్లలో ఈ రెండింటినీ వేసి బాగా కలపాలి. ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం కావడమే కాకుండా తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది. నిమ్మరసం చెమటకు చెక్ పెట్టి, జిడ్డుదనాన్ని నివారిస్తే, రోజ్‌వాటర్ మనల్ని అధిక సమయం తాజాగా కనిపించేలా చేస్తుంది.

తేనె, వెనిగర్‌తో..

naturalbathghgh650-3.jpg
తేనేతో తాజతాజగా

కావాల్సినవి:
* వెనిగర్- 1 కప్పు
* తేనె- 1 చెంచా
ఒక బకెట్ నీళ్లలో కప్పు వెనిగర్, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం ద్వారా వేడి కారణంగా అలసిన చర్మానికి సాంత్వన చేకూరుతుంది. అలాగే చికాకు కూడా తగ్గుతుంది. సూర్యరశ్మి కారణంగా కమిలిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు మృదువుగానూ మారుతుంది.

పాలు, తేనెతో..

naturalbathghgh650-7.jpg
పాలతో

ఒక కప్పులో పచ్చిపాలు, తేనె సమపాళ్లలో (అరకప్పు చొప్పున) తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని తాజా గులాబీ రేకల్ని కూడా ఈ నీటికి జత చేయచ్చు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తిరిగి తాజాగా మారడంతో పాటు, ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. పాలల్లోని లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తే, తేనె చర్మానికి సహజసిద్ధంగా తేమని అందించి మృదువుగా మారుస్తుంది.

సీ సాల్ట్, బేకింగ్ సోడాతో..

naturalbathghgh650-1.jpg
సీసాల్ట్

సీ సాల్ట్, బేకింగ్ సోడా కొద్దికొద్దిగా తీసుకుని స్నానం చేసే నీటిలో వేసి బాగా కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తిరిగి తాజాగా మారుతుంది. ఇందులో ఉపయోగించిన ఉప్పు చర్మపు పొరల్లో ఉన్న జిడ్డుని తొలగిస్తే, బేకింగ్ సోడా ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేసి చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

ఇవే కాదు.. ఐదారు బ్లాక్ లేదా గ్రీన్ టీ బ్యాగ్స్‌ను తీసుకుని లీటర్ నీళ్లలో వేసి అవి అరలీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కూడా స్నానం చేసే నీళ్లలో కలిపి రిఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. రోజ్ ఆయిల్, ఓట్స్, వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్, బాత్ సాల్ట్స్.. మొదలైనవి ఉపయోగించి కూడా ఎండ కారణంగా అలసిన చర్మానికి తిరిగి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు మనం కూడా ఉత్సాహంగా మారచ్చు. కావాలంటే మీరూ వీటిని ఓసారి ప్రయత్నించి చూడండి..!

ఇదీ చూడండి: మలి వయసులో తోడు కావాలనుకోవడం తప్పా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.