ETV Bharat / lifestyle

Immunity: వ్యాధి నిరోధక శక్తి పేరుతో సరికొత్త మెడికల్ దందా - ఇమ్యూనిటీ పేరుతో దందా

కరోనా వైరస్​ను ఆసరాగా చేసుకుని మెడికల్ మాఫియాలు పుట్టుకొస్తున్నాయి. వ్యాధి నిరోధక శక్తి పేరుతో సరికొత్త దందాకు తెరతీశాయి. ఈ ట్యాబ్లెట్లను వాడితే కొవిడ్​ను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్‌ పేరుతో అంతర్జాలం నుంచి పచారీ దుకాణం వరకూ కనిపిస్తున్న ప్రకటనలు...వీటితో పాటు పలు ఈ-కామర్స్‌ సంస్థలు రాయితీపై ఇంటికే మందులు చేరవేస్తున్నాయి. అయితే వీటికి ఎలాంటి శాస్త్రీయత లేదని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ట్యాబ్లెట్లు దీర్ఘకాల వినియోగంతో కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

medical
వ్యాధి నిరోధక శక్తి పేరుతో సరికొత్త మెడికల్ దందా
author img

By

Published : Jun 3, 2021, 12:12 PM IST

ఫలానా మాత్రలు తీసుకుంటే కొవిడ్‌ను ఎదుర్కోవచ్చు.. ఈ పొడి అర చెంచా పరిమాణంలో వాడితే ఎటువంటి వైరస్‌ అయినా మీ దరి చేరదు.. ఇమ్యూనిటీ బూస్టర్స్‌ పేరుతో అంతర్జాలం నుంచి పచారీ దుకాణం వరకూ కనిపిస్తున్న ప్రకటనలు.. ఇవీ పలు ఇ-కామర్స్‌ సంస్థలు రాయితీపై ఇంటికే చేరవేస్తున్నాయి. కొవిడ్‌ మూడో దశ పిల్లలపై ప్రభావం చూపుతుందనే కారణాన్ని చూపుతూ కిడ్స్‌ స్పెషల్‌ బూస్టర్స్‌ అంటూ మొబైల్‌ ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు. వ్యాధిని తట్టుకునేందుకు శరీరాన్ని సహజంగా సిద్ధంగా చేయాలి. ఒకటి రెండ్రోజుల్లో రోగనిరోధక శక్తి రావడం సాధ్యం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ భయాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆయుర్వేదం, అల్లోపతి ముసుగులో విపణిలోకి వివిధ రూపాల్లో ఇమ్యూనిటీ బూస్లర్లు చేరుతున్నాయి. వీటిలో చాలావాటికి ఎటువంటి శాస్త్రీయత లేదని తేల్చి చెబుతున్నారు. దీర్ఘకాల వినియోగంతో కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

కరోనా రెండో దశ తీవ్రత భయాందోళన రేకెత్తించింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోషకాహారం తీసుకోవటంపై ఆసక్తి పెరిగింది. కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్న నగర ప్రజలు వైరస్‌ బారిన పడకుండా పలు మార్గాలు అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇమ్యూనిటీ బూస్టర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్‌లో వాటికి డిమాండ్‌ పెరగటంతో సప్లిమెంట్స్, ప్రొటీన్స్, విటమిన్ల పేరుతో పలు రకాల పౌడర్లు దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే రాయితీలు/బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందంటూ ఊదర గొడుతున్నారు. ఆయుర్వేద వైద్యం పట్ల ఆసక్తి పెరగటాన్ని నకిలీలు సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గుళికలు, పౌడర్లు, పసరు వంటి వాటి గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ఇంటి వద్దకే కొవిడ్‌ సోకకుండా ఇమ్యూనిటీ బూస్టర్‌ పంపుతామంటున్నారు. దర్జాగా ఆన్‌లైన్‌ ద్వారా సొమ్ములు వసూలు చేసుకుంటున్నారు. కొవిడ్‌పై భయంతో వీటిని వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

అనారోగ్యం కొనితెచ్చుకోవద్దు

పోషకాహారం, సరైన నిద్ర, వ్యాయామం.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవేమీ లేకుండా కేవలం విటమిన్లు తీసుకోవటం వల్ల కొవిడ్‌ సోకదనేది అపోహ మాత్రమేనని ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ రమణప్రసాద్‌ వి.వి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ప్రతి అంశాన్ని అనుసరించవద్దంటున్నారు. కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌ ధరించటం, చేతులు పరిశుభ్రం, వ్యక్తిగత దూరం పాటించటం తప్పనిసరి. ‘‘ఆయుర్వేదంలో వ్యాధి లక్షణాలు, రోగి పరిస్థితికి తగినట్టుగా ఎంత మోతాదులో మందు ఇవ్వాలనేది స్పష్టంగా ఉంటుంది. వార్దక్యంలో మాత్రమే వ్యాధి నిరోధక శక్తికి రసాయనాలు వాడుతుంటా’’రని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్‌ సునీతాజోషి చెప్పారు. పాలు, మజ్జిగ, తేనె, తులసి, పసుపు వంటివి వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయని వివరించారు.

ఇదీ చూడండి: Eatala : హైదరాబాద్​ చేరుకున్న ఈటల.. స్వాగతం పలికిన అనుచరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.