మిగిలిన అన్ని గ్రూపులతో పోలిస్తే ‘ఓ’ గ్రూపు ఉన్న వాళ్లకి కరోనా సోకే అవకాశం చాలా తక్కువని అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ వెల్లడించింది. డెన్మార్క్‌లో కొవిడ్ పరీక్ష చేసి పాజిటివ్ వచ్చిన ఐదు లక్షల మందిని పరిశీలించగా అందులో అందరికన్నా ‘ఓ’ గ్రూపు వాళ్లే తక్కువగా ఉన్నారట. ఎ, బి, ఎబి గ్రూపులమధ్య పెద్ద వ్యత్యాసం కనిపించలేదట. అయితే, కొవిడ్ సోకిన తరవాత ఎక్కువ ఇబ్బంది పడ్డవాళ్లలో బి గ్రూపుతో పోలిస్తే ఎబి, ఎ గ్రూపు వాళ్లే ఎక్కువగా ఉన్నారట.
వాంకోవర్‌లో ఆసుపత్రి పాలైన వాళ్లలో వెంటిలేషన్ అవసరమైన వాళ్లలో ఎక్కువమంది ఎ, ఎబి గ్రూపులున్నవాళ్లే ఉన్నారట. వీళ్లలో ఎక్కువమందికి మూత్రపిండాలూ, ఊపిరితిత్తులూ దెబ్బతిన్నట్లు గుర్తించారట. దీని ఆధారంగా ఎ, ఎబి గ్రూపులతో పోలిస్తే ఓ, బి గ్రూపులు ఉన్నవాళ్లకి కొవిడ్ వల్ల పెద్ద ప్రమాదం లేదని భావిస్తున్నారు.
- ఇదీ చూడండి : 2021 రెండో త్రైమాసికంలో భారత్ బయోటెక్ టీకా