కుంగుబాటు వల్ల మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా ఒకే రకమైన బొమ్మల్ని వెలుగులోనూ వాటినే లైటింగ్ తగ్గించి చూపించినప్పుడు అవి ఇద్దరికీ వేర్వేరుగా కనిపించాయట. ముఖ్యంగా ఆయా బొమ్మల్ని మసక కాంతిలో చూపించినప్పుడు డిప్రెషన్ బాధితులకు అవి వేరుగా కనిపించాయనీ దాంతో వాళ్లు దాన్ని మరో రకంగా అర్థం చేసుకున్నారనీ గ్రహించారు.
అంతేకాదు, ఆ సమయంలో వాళ్ల మెదడు కూడా భిన్నంగా స్పందించడాన్నీ గుర్తించారు. దీన్నిబట్టి డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు ఎక్కువగా భ్రమలకి లోనవడానికి కారణం మెదడు పనితీరులోని లోపమేననీ, కాబట్టి దీని ఆధారంగా కుంగుబాటుకి చికిత్స చేయగలిగితే ఫలితం ఉండొచ్చనీ భావిస్తున్నారు.
ఇదీ చూడండి: 'హ్యాపీనెస్ కిట్'తో నెలసరి సమస్యలకు పరిష్కారం!