శానిటైజేషన్ అంటేనే విసుగొచ్చేస్తుంది.. ఇక రెండుమూడు రోజులకోసారి తెచ్చుకునే కాయగూరలు, పండ్లను శుభ్రం చేయలేక చాలామంది మహిళలకు తల ప్రాణం తోకకొస్తుందని చెప్పాలి. అయితే ఇకపై ఆ శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే కాయగూరలు, పండ్లను నిమిషాల్లో శానిటైజ్ చేసే గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. అందుబాటు ధరల్లో లభించే వాటిని ఒకసారి కొని ఇంటికి తెచ్చుకున్నామంటే వంటింట్లో పని మరింత సులువవుతుంది. మరి, కాయగూరలు-పండ్లను శుభ్రం చేసే ఆ గ్యాడ్జెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి...
కరోనా వచ్చిన దగ్గర్నుంచి బయటి నుంచి తెచ్చిన కాయగూరలు-ఆకుకూరలు-పండ్లు.. వంటివన్నీ ఉప్పు నీరు/పసుపు నీటితో కడగడం మనకు అలవాటైంది. నిజానికి అదో పెద్ద పనిలా అనిపిస్తుంది. అదే ఈ వెజిటబుల్-ఫ్రూట్ క్లీనింగ్ గ్యాడ్జెట్స్‌తో పని మరింత సులభతరం అవుతుంది. అయితే వీటిలో మొదటి మూడు ఓజోన్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తాయి. అంటే వీటిలో ఓజోన్ అవుట్‌పుట్ (ఊదా రంగులోఉండే గుండ్రటి పదార్థం) అమరి ఉంటుంది. ఇది డిస్-ఇన్ఫెక్షన్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. కాయగూరలు-పండ్లపై ఉన్న రసాయనాల దగ్గర్నుంచి వాటిపై చేరిన బ్యాక్టీరియా, వైరస్‌లను ఇది పూర్తిగా నశింపజేస్తుంది.
వెజిటబుల్-ఫ్రూట్ క్లీనర్
పండ్లు-కాయగూరల్ని నిమిషాల్లో శుభ్రం చేసే ఈ క్లీనర్ చూడ్డానికి అచ్చం ప్యూరిఫయర్‌లా ఉంటుంది. దీనికి వెనక వైపు వాషింగ్ మెషీన్‌కి అనుసంధానమై ఉన్న అవుట్‌లెట్ పైపులా ఒక పైపు అమరి ఉంటుంది. ఇక మధ్యలో పెద్ద డబ్బా, కింద మెషీన్, పైన మూత సెట్ చేసి ఉంటాయి. అలాగే డబ్బా అడుగున మధ్య భాగంలో శానిటైజ్ చేసే ఓజోన్ అవుట్‌పుట్ అమరి ఉంటుంది.

ఇప్పుడు ఈ ఖాళీ డబ్బాలో శానిటైజ్ చేయాలనుకున్న పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు వేసి.. నీళ్లు పోయాలి. ఆపై ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి.. ఈ క్లీనర్ ముందు భాగంలో కింద వైపు ఉన్న స్టార్ట్ బటన్ నొక్కాలి. కావాలనుకుంటే మీరు ఇందులో టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక పని పూర్తయ్యాక ఇందులోని నీళ్లను వెనకవైపు ఉన్న పైపు ద్వారా తొలగించచ్చు. ఆపై కాయగూరల్ని ఓసారి కుళాయి నీళ్లతో శుభ్రం చేసుకొని వాడుకోవడమే! ఇదే విధంగా ఈ బాక్స్‌ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. ఈ క్లీనర్ కెపాసిటీ (లీటర్లలో)ని బట్టి ధర రూ. 2,490 నుంచి మొదలవుతుంది.
ఓజోనైజర్
ఎక్కువ మొత్తంలో కాయగూరలు, పండ్లు తెచ్చుకున్నప్పుడు వాటన్నింటినీ ఒకేసారి శుభ్రం చేయడం కోసం ఒక పెద్ద టబ్‌లో వేస్తుంటాం. అలాగని మళ్లీ వాటిని ఉప్పు నీరు/ పసుపు నీటితో కడిగే పని లేకుండా ‘ఓజోనైజర్’తో ఈజీగా క్లీన్ చేయచ్చు.
ఫొటోలో చూపించినట్లుగా ఒక చిన్న బాక్స్ మాదిరిగా ఉంటుందిది. దీనికి ఒకవైపు చిన్న పైప్‌లా ఉండి.. దానికి చివర ఓజోన్ అవుట్‌పుట్ ఉంటుంది. ఇప్పుడు టబ్‌లో కాయగూరలు-పండ్లు వేసి.. నీళ్లు నింపి.. ఈ ఓజోన్ అవుట్‌పుట్‌ను అందులో ఉంచాలి. ఆపై ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేసి.. స్విచ్ ఆన్ చేసి.. ఓజోనైజర్ ముందు భాగంలో ఉండే స్టార్ట్ బటన్‌ని నొక్కాలి. ఇలా మీరు ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు కాయగూరల్ని శానిటైజ్ చేసుకోవచ్చు. పని పూర్తయ్యాక ఆ నీటిని పడేసి.. మరోసారి శుభ్రమైన నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ ఓజోనైజర్ మోడల్‌ను బట్టి ధర రూ. 2,749 నుంచి రూ. 5,515 వరకు ఉంటుంది.
వెజిటబుల్ వాషింగ్ మెషీన్
కాయగూరలు, పండ్లు, ఆకుకూరల్ని శానిటైజ్ చేసుకోవడానికి ఓ మినీ వాషింగ్ మెషీన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చారు డిజైనర్లు. అదే ‘వెజిటబుల్ వాషింగ్ మెషీన్’. పేరుకు తగ్గట్లే బట్టలు ఉతికే వాషర్‌లా ఉండే ఇది వేర్వేరు కెపాసిటీల్లో లభిస్తోంది. ముందుగా ఇందులో శానిటైజ్ చేయాలనుకున్న కాయగూరలు, పండ్లు వేసి నీళ్లు నింపి.. మెషీన్ ముందు భాగంలో ఉండే స్విచ్ ఆన్ చేయాలి.
ఇందులోని ఓజోన్ అవుట్‌పుట్ సహాయంతో కాయగూరలన్నీ మనం సెట్ చేసుకున్న సమయాన్ని బట్టి శుభ్రమవుతాయి. ఆపై నీటిని వెనకవైపు ఉన్న పైపు సహాయంతో తొలగించచ్చు. ఇలా శుభ్రం చేసిన కాయగూరల్ని కుళాయి నీటి కింద ఒకసారి కడిగి వాడుకోవచ్చు. వాడుకోవడానికి సులభంగా, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే ఈ మెషీన్ ధర రూ. 3,786 నుంచి మొదలవుతుంది.
యూవీ స్టెరిలైజర్ బాక్స్
ప్రస్తుతం ఏ వస్తువునైనా ఇట్టే శానిటైజ్ చేసేందుకు వీలుగా యూవీ లైట్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకొచ్చాయి. అలాంటిదే ఈ ‘యూవీ స్టెరిలైజ్ బాక్స్’ కూడా! చూడ్డానికి అచ్చం టెంట్ మాదిరిగా ఉండే దీనికి
ఈ వెజిటబుల్-ఫ్రూట్ క్లీనింగ్ గ్యాడ్జెట్స్‌తో పని మరింత సులభతరం అవుతుంది. అయితే వీటిలో మొదటి మూడు ఓజోన్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తాయి. అంటే వీటిలో ఓజోన్ అవుట్‌పుట్ (ఊదా రంగులోఉండే గుండ్రటి పదార్థం) అమరి ఉంటుంది. ఇది డిస్-ఇన్ఫెక్షన్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. కాయగూరలు-పండ్లపై ఉన్న రసాయనాల దగ్గర్నుంచి వాటిపై చేరిన బ్యాక్టీరియా, వైరస్‌లను ఇది పూర్తిగా నశింపజేస్తుంది.
వెజిటబుల్-ఫ్రూట్ క్లీనర్
పండ్లు-కాయగూరల్ని నిమిషాల్లో శుభ్రం చేసే ఈ క్లీనర్ చూడ్డానికి అచ్చం ప్యూరిఫయర్‌లా ఉంటుంది. దీనికి వెనక వైపు వాషింగ్ మెషీన్‌కి అనుసంధానమై ఉన్న అవుట్‌లెట్ పైపులా ఒక పైపు అమరి ఉంటుంది. ఇక మధ్యలో పెద్ద డబ్బా, కింద మెషీన్, పైన మూత సెట్ చేసి ఉంటాయి. అలాగే డబ్బా అడుగున మధ్య భాగంలో శానిటైజ్ చేసే ఓజోన్ అవుట్‌పుట్ అమరి ఉంటుంది.
ఇప్పుడు ఈ ఖాళీ డబ్బాలో శానిటైజ్ చేయాలనుకున్న పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు వేసి.. నీళ్లు పోయాలి. ఆపై ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి.. ఈ క్లీనర్ ముందు భాగంలో కింద వైపు ఉన్న స్టార్ట్ బటన్ నొక్కాలి. కావాలనుకుంటే మీరు ఇందులో టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక పని పూర్తయ్యాక ఇందులోని నీళ్లను వెనకవైపు ఉన్న పైపు ద్వారా తొలగించచ్చు. ఆపై కాయగూరల్ని ఓసారి కుళాయి నీళ్లతో శుభ్రం చేసుకొని వాడుకోవడమే! ఇదే విధంగా ఈ బాక్స్‌ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. ఈ క్లీనర్ కెపాసిటీ (లీటర్లలో)ని బట్టి ధర రూ. 2,490 నుంచి మొదలవుతుంది.
ఓజోనైజర్
ఎక్కువ మొత్తంలో కాయగూరలు, పండ్లు తెచ్చుకున్నప్పుడు వాటన్నింటినీ ఒకేసారి శుభ్రం చేయడం కోసం ఒక పెద్ద టబ్‌లో వేస్తుంటాం. అలాగని మళ్లీ వాటిని ఉప్పు నీరు/ పసుపు నీటితో కడిగే పని లేకుండా ‘ఓజోనైజర్’తో ఈజీగా క్లీన్ చేయచ్చు.
ఫొటోలో చూపించినట్లుగా ఒక చిన్న బాక్స్ మాదిరిగా ఉంటుందిది. దీనికి ఒకవైపు చిన్న పైప్‌లా ఉండి.. దానికి చివర ఓజోన్ అవుట్‌పుట్ ఉంటుంది. ఇప్పుడు టబ్‌లో కాయగూరలు-పండ్లు వేసి.. నీళ్లు నింపి.. ఈ ఓజోన్ అవుట్‌పుట్‌ను అందులో ఉంచాలి. ఆపై ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేసి.. స్విచ్ ఆన్ చేసి.. ఓజోనైజర్ ముందు భాగంలో ఉండే స్టార్ట్ బటన్‌ని నొక్కాలి. ఇలా మీరు ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు కాయగూరల్ని శానిటైజ్ చేసుకోవచ్చు. పని పూర్తయ్యాక ఆ నీటిని పడేసి.. మరోసారి శుభ్రమైన నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ ఓజోనైజర్ మోడల్‌ను బట్టి ధర రూ. 2,749 నుంచి రూ. 5,515 వరకు ఉంటుంది.
వెజిటబుల్ వాషింగ్ మెషీన్
కాయగూరలు, పండ్లు, ఆకుకూరల్ని శానిటైజ్ చేసుకోవడానికి ఓ మినీ వాషింగ్ మెషీన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చారు డిజైనర్లు. అదే ‘వెజిటబుల్ వాషింగ్ మెషీన్’. పేరుకు తగ్గట్లే బట్టలు ఉతికే వాషర్‌లా ఉండే ఇది వేర్వేరు కెపాసిటీల్లో లభిస్తోంది. ముందుగా ఇందులో శానిటైజ్ చేయాలనుకున్న కాయగూరలు, పండ్లు వేసి నీళ్లు నింపి.. మెషీన్ ముందు భాగంలో ఉండే స్విచ్ ఆన్ చేయాలి.
ఇందులోని ఓజోన్ అవుట్‌పుట్ సహాయంతో కాయగూరలన్నీ మనం సెట్ చేసుకున్న సమయాన్ని బట్టి శుభ్రమవుతాయి. ఆపై నీటిని వెనకవైపు ఉన్న పైపు సహాయంతో తొలగించచ్చు. ఇలా శుభ్రం చేసిన కాయగూరల్ని కుళాయి నీటి కింద ఒకసారి కడిగి వాడుకోవచ్చు. వాడుకోవడానికి సులభంగా, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే ఈ మెషీన్ ధర రూ. 3,786 నుంచి మొదలవుతుంది.
యూవీ స్టెరిలైజర్ బాక్స్
ప్రస్తుతం ఏ వస్తువునైనా ఇట్టే శానిటైజ్ చేసేందుకు వీలుగా యూవీ లైట్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకొచ్చాయి. అలాంటిదే ఈ ‘యూవీ స్టెరిలైజ్ బాక్స్’ కూడా! చూడ్డానికి అచ్చం టెంట్ మాదిరిగా ఉండే దీనికి పైభాగంలో అతినీలలోహిత కిరణాలు ప్రసరించేలా ఒక యూవీ-సీ మాడ్యూల్‌ను అమర్చుకోవచ్చు. అయితే దాన్ని టెంట్‌పై సూచించిన ఛార్జింగ్ పాయింట్‌కు అనుసంధానిస్తూ అమర్చుకోవడం ముఖ్యం.
ఇలా అటాచ్ చేయగానే మాడ్యూల్‌పై ఉన్న రెడ్‌లైట్ వెలుగుతూ యూవీ లైట్ కిందికి ప్రసరిస్తుంది. ఇప్పుడు ఈ అమరికను మనం శానిటైజ్ చేయాలనుకున్న ఫ్రూట్/వెజిటబుల్ బౌల్‌పై కనీసం మూడు నిమిషాల పాటు ఉంచాలి. తద్వారా దాన్నుంచి ప్రసరించే యూవీ కిరణాల ద్వారా శానిటైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. కావాలనుకుంటే ఈ కాయగూరలు-పండ్లను ఆపై కుళాయి నీళ్లతో కడిగి వాడుకుంటే సరిపోతుంది. ఈ యూవీ స్టెరిలైజర్ బాక్స్ ధర రూ. 1,299గా ఉంది.
మల్టీపర్పస్ డిస్-ఇన్ఫెక్టన్ట్
బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువుపై శానిటైజర్‌ను స్ప్రే చేయడం మనకు అలవాటుగా మారిపోయింది. అలా కాయగూరలు-పండ్లపై కూడా స్ప్రే చేస్తూ వాటిని శానిటైజ్ చేయచ్చు. అయితే దీనికోసం ప్రత్యేకంగా శానిటైజర్‌ను తయారుచేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రూపొందించిందే ‘మల్టీపర్పస్ డిస్-ఇన్ఫెక్టన్ట్’.
చూడ్డానికి అచ్చం మిస్ట్ (స్ప్రే బాటిల్) బాటిల్‌లా ఉండే ఇందులో నీళ్లు నింపుకొని, టీస్పూన్ ఉప్పు, కొద్దిగా వెనిగర్ వేయాలి. ఆపై ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేసి.. స్విచ్ ఆన్ చేసి.. దీనికి ముందు భాగంలో ఉన్న స్టార్ట్ బటన్‌ని నొక్కాలి. ఇలా ఐదు నిమిషాల పాటు ఉంచితే న్యాచురల్ శానిటైజర్ తయారవుతుంది. ఆపై దీన్ని కాయగూరలు-పండ్లు-ఆకుకూరలపై స్ప్రే చేసి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. ఆఖరుగా వాటిని కుళాయి నీళ్ల కింద కడిగేస్తే నిమిషాల్లో పని పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ గ్యాడ్జెట్ ధర మార్కెట్లో రూ. 3,799గా ఉంది.
చూశారుగా.. కాయగూరలు-పండ్లను ఈ గ్యాడ్జెట్స్‌తో ఎంత సులభంగా క్లీన్ చేసుకోవచ్చో! మరి, కాయగూరల్ని శానిటైజ్ చేయడానికి మీరెలాంటి పద్ధతులు/గ్యాడ్జెట్స్‌ని ఫాలో అవుతున్నారు? కింది కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి. మీరిచ్చే సలహాలు మరింత మంది మహిళలకు ఉపయోగపడచ్చు..!