ETV Bharat / lifestyle

బరువు పెరుగుతామేమోనని ఈ పదార్థాలను దూరం పెట్టకండి!

author img

By

Published : Mar 4, 2021, 12:26 PM IST

సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలను దూరం పెడతారు. ప్రత్యేకించి క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ శక్తి అందుతుందని, దీనివల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. అయితే మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు క్యాలరీలు కూడా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే సమయంలో క్యాలరీలు అధికంగా ఉండే కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందచ్చని చెబుతున్నారు. పైగా వీటి ద్వారా అధిక బరువు, ఊబకాయం.. వంటి సమస్యల నుంచి బయటపడచ్చంటున్నారు. మరి, ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లు ఆరోగ్య ప్రయోజనాలు అందించే అధిక క్యాలరీలున్న ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

high-calorie-food-items-that-are-actually-healthy
బరువు పెరుగుతామేమోనని ఈ పదార్థాలను దూరం పెట్టకండి!

క్వినోవా
‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ గ్రెయిన్స్‌’ పేరున్న క్వినోవాను ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఒక కప్పు (సుమారు 185 గ్రాములు) క్వినోవాను తీసుకుంటే శరీరానికి సుమారు 222 క్యాలరీల శక్తి అందుతుంది. ఇక వీటిలోని ప్రొటీన్లు, అన్‌-శ్యాచురేటెడ్‌ కొవ్వులు, కా‌ల్షియం, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాపర్‌, జింక్‌, బి6, ఇ.. వంటి విటమిన్లు, నియాసిన్‌, థయమిన్‌.. తదితర పోషకాలు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా-3ఫ్యాటీ ఆమ్లాల రూపంలో శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా క్వినోవాలో ఉంటాయి. పీచు పదార్థాలు అధికంగా ఉండే క్వినోవా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.

సబ్జా గింజలు
ఒక టేబుల్‌ స్పూన్‌ సబ్జా గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి సుమారు 70 క్యాలరీల శక్తి అందుతుంది. బరువు తగ్గించుకుని రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇందులో గ్లూటెన్‌ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రొటీన్లు, ఒమేగా-3ఫ్యాటీ ఆమ్లాలు...తదితర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ గింజల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇక ఇందులోని ప్రొటీన్లు ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుతాయి.

పీనట్‌ బటర్‌
సాధారణంగా చాలామంది పీనట్ బటర్‌ వల్ల బరువు పెరుగుతామేమోనని దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఒక టేబుల్‌ స్పూన్‌ (సుమారు 100క్యాలరీల శక్తి ఉండే) పీనట్‌ బటర్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ప్రొటీన్లు, అన్‌-శ్యాచురేటెడ్‌ ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌.. తదితర పోషకాలు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయట!

పెరుగు
సాధారణంగా ముప్పావు కప్పు పెరుగులో 150 క్యాలరీలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా లభించే ప్రొ-బయోటిక్స్‌ శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. అలాగే ప్రొటీన్లు, విటమిన్‌ ‘ఎ’, జింక్‌...తదితర పోషకాలు శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి.

ఖర్జూరం
ఒక్క ఖర్జూరం తింటే శరీరానికి సుమారు 23 క్యాలరీల శక్తి అందుతుంది. ఇందులో ప్రొటీన్లు, క్యా్‌ల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌.. ఎ, బి1, బి2.. వంటి విటమిన్లు, ఫ్రక్టోజ్‌, సెల్యులోజ్‌, పీచు, ఎలక్ట్రోలైట్స్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌.. తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తక్షణ శక్తినిచ్చే ఖర్జూరాలతో రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు మూడు, నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు.. ఖర్జూరాల వల్ల గుండె జబ్బులు కూడా దూరమవుతాయి. ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఆలివ్‌ నూనె
ఆరోగ్యదాయిని అని పేరున్న ఆలివ్‌ నూనెలో మోనో అన్‌-శ్యాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా శరీరంలోని అవయవాల పనితీరును వేగవంతం చేస్తాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఎ, ఇ, డి, కె-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్‌ ఆయిల్‌ను వంటల్లో వాడడం ద్వారా మెదడు పనితీరు మరింత మెరుగవుతుంది. మతిమరుపును తగ్గించి, జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఈ నూనెకు ఉంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తాయి. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్‌ గుణాలున్న ఈ నూనెతో మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. ఇక చర్మ సౌందర్యానికి కూడా ఈ నూనె బాగా సహకరిస్తుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి.

చేపలు
చేపల్లో క్యాలరీలతో పాటు కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్‌ ఆహారపు కోరికల్ని నియంత్రించడానికి సహకరిస్తుంది. వంద గ్రాముల చేపల్లో 206 క్యాలరీలుంటాయి.

డార్క్‌ చాక్లెట్‌
క్యాలరీలు అధికంగా ఉండే డార్క్‌ చాక్లెట్లను స్వచ్ఛమైన కొకోవాతో తయారుచేస్తారు. ఇది ఆకలిని నియంత్రిస్తూ, బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అలాగే ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెఫీన్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక ఫ్లేవనాయిడ్లు మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి. అదేవిధంగా ఫైబర్‌, ఐరన్‌, కాపర్‌, మెగ్నీషియం, మాంగనీస్‌.. వంటి సూక్ష్మపోషకాలు రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొబ్బరి
కొబ్బరిని ఆహార పదార్థాల తయారీలో వాడినా, కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తిన్నా బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఇది శరీర బరువును ఏ మాత్రం ప్రభావితం చేయదంటున్నారు నిపుణులు. కొబ్బరిలో ఉండే శ్యాచురేటెడ్‌ ఆమ్లాలు, లారికామ్లం శరీరంలో కొవ్వు స్థాయులను నియంత్రిస్తాయి. అదేవిధంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వులను తగ్గిస్తాయి.

అవకాడో
అవకాడోలో మోనో అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వీటిల్లో అధికమొత్తంలో ఉండే ఫైబర్‌, ప్రొటీన్‌ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువమొత్తంలో తీసుకోకుండా జాగ్రత్తపడతాం.

ఇవేకాకుండా శెనగలు, ఎండు ద్రాక్ష, గోధుమ బ్రెడ్‌, పచ్చి బఠానీలు, మొక్కజొన్న, కొన్ని రకాల పప్పుధాన్యాలు, గింజలు... తదితర వాటిల్లోనూ క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే ఇవి అందించే పోషకాలు మాత్రం పుష్కలం. అందుకే బరువు పెరుగుతామేమోనన్న భయంతో ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టకండి. రోజువారీ మెనూలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..!

ఇదీ చూడండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.