చేపలు
దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యమంతమైన మెదడు కణాల నిర్మాణానికి తోడ్పడతాయి. దిగులును దరిచేరనీయవు. ఈ యాసిడ్లను మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. కాబట్టి సాల్మన్ చేపలను విరివిగా తీసుకోవాలి.
డార్క్ చాక్లెట్
మూడ్ సరిగ్గా లేనప్పుడు డార్క్ చాక్లెట్‌ను నోట్లో వేసుకుంటే తేడా మీకే తెలుస్తుంది. ఇది మెదడుకు చురుకుదనాన్ని అందిస్తుంది. అయితే సరైన డార్క్ చాక్లెట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ చాక్లెట్‌లో 70 శాతం కోకో ఉండేలా చేసుకోవాలి. అంటే చాక్లెట్ బాగా తియ్యగా ఉండకుండా చిరు చేదుగానూ ఉండాలి.
పాలకూర
దీంట్లో మెగ్నీషియం, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి మూడ్ బాగుండేలా చేస్తాయి.
బాదం పప్పు
దీంట్లో ఉండే మంచి కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అధికంగా ఉండే టైరోసిన్ ఒత్తిడిని నియంత్రిస్తుంది.
స్ట్రాబెర్రీలు
పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే అయినా స్ట్రాబెర్రీలు మెదడు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి. వీటిలో అధికంగా ఉండే ప్లవనాయిడ్లు మూడ్‌ను నియంత్రిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
ఇదీ చదవండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!