చేతులను ముందుగా భుజాలకు సమానంగా చాపి పైకి లేపి కిందకు తీసుకురావాలి. ఇలా పదిసార్ల చొప్పున మూడు సెట్లు చేయాలి. దీంతో చేతుల దగ్గర ఉండే కండరాలు వదులవుతాయి.
* రెండు చేతులతో బరువైన వస్తువును ముందుకు తోస్తున్నట్లు చేయాలి. ఆ తర్వాత దాన్ని వెనక్కు లాగుతున్నట్టు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు చేతులు తలకంటే పైకి ఉండేలా చూసుకోవాలి.
* భుజాలకు సమానంగా చేతులను చాపి తర్వాత ముందుకు తీసుకొచ్చి... ఒక చెయ్యి మీద మరో చెయ్యి పెట్టాలి. చేతులు ‘ఎక్స్’ ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా విడతకు పది చొప్పున మూడు సార్లు చేయాలి.
* నిటారుగా నిలబడి చేతులను పైకి ఎత్తి నమస్కార ముద్రలో ఉంచాలి. వాటిని అదే స్థితిలో ఉంచి వెనక్కు మెడ కింద వరకూ తీసుకెళ్లాలి. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ఇలా ఇరవై చొప్పున మూడుసార్లు చేయాలి. నేరుగా చేతులను వీపు వెనక పెట్టి కూడా నమస్కార ముద్ర వేయొచ్చు.
* చేతులను పక్కకు చాపి వేళ్లను మూసి... గుప్పిటని సవ్య, అపసవ్య దిశల్లో తిప్పాలి. ఇలా ఇరవైసార్లు చేస్తే విశ్రాంతి లభిస్తుంది.
ఈ వ్యాయామాలకు క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే తేడా స్పష్టంగా మీకే తెలుస్తుంది.
ఇదీ చూడండి: లైఫ్ పార్ట్నర్కి ఇలా సున్నితంగా చెప్పండి...