ETV Bharat / lifestyle

Cancer diagnosis : క్యాన్సర్‌ నిర్ధారణకు మెషిన్‌లెర్నింగ్‌ సాంకేతికత! - cancer can be diagnosed by machine learning technology

క్యాన్సర్ నిర్ధారణ(Cancer diagnosis)లో జాప్యం జరగకుండా డేటాబేస్ పరిష్కారం చూపనుంది. దేశంలోనే తొలిసారిగా నిమ్స్ ఆస్పత్రి భాగస్వామ్యంతో ట్రిపుల్​ ఐటీ-హైదరాబాద్​ పరిశోధకులు వ్యాధి నిర్ధారణ డేటాబేస్(disease diagnosis database)​ను తయారు చేస్తున్నారు.

క్యాన్సర్‌ నిర్ధారణకు మెషిన్‌లెర్నింగ్‌ సాంకేతికత

author img

By

Published : Oct 3, 2021, 9:32 AM IST

మెషిన్‌ లెర్నింగ్‌(Machine Learning Technology) సాయంతో వేగంగా, సులువుగా క్యాన్సర్లను నిర్ధారించే ప్రక్రియకు ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌ పరిశోధకులు శ్రీకారం చుట్టారు. నిమ్స్‌ ఆసుపత్రి భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా వ్యాధి నిర్ధారణ డేటాబేస్‌(disease diagnosis database) తయారు చేస్తున్నారు. డయాగ్నసిస్‌ నమూనాల ఆధారంగా వ్యాధులను నిర్ధారించే వ్యవస్థకు ఇక్కడి ‘ఐహబ్‌’లో రూపకల్పన జరుగుతోంది. దీనికి ట్రిపుల్‌ఐటీ ఆచార్యుడు డాక్టర్‌ వినోద్‌ నేతృత్వం వహిస్తున్నారు.

నిమ్స్‌లో 15 ఏళ్లుగా అందుబాటులో ఉన్న క్యాన్సర్‌ నమూనాల(స్లైడ్స్‌)ను సమగ్ర వివరాలతో డిజిటలైజ్‌ చేయనున్నారు. తొలుత ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి హిస్టోపాథలాజికల్‌ స్లైడ్స్‌ను కంప్యూటరీకరిస్తున్నారు. భవిష్యత్తులో పాథాలజిస్టు ఏదైనా నమూనా లేదా బయాప్సీని తీసుకొని విశ్లేషించే క్రమంలో అప్పటికే డేటాబేస్‌(disease diagnosis database)లో ఉన్న డిజిటల్‌ నమూనాలతో సరిపోలుస్తారు. మెషిన్‌ లెర్నింగ్‌ విధానం(Machine Learning Technology)లో విశ్లేషించి క్యాన్సర్‌ రకం, దశలను కంప్యూటర్‌ వివరిస్తుంది. ఆయా నమూనాలను వేరొక ప్రాంతానికి పంపించే పని ఉండదు.

దేశంలో 2 వేల మంది పాథాలజిస్టులు ఉండగా.. క్యాన్సర్‌(Cancer diagnosis)ను నిర్ధారించే పరిజ్ఞానం ఉన్నవారు 500లోపే ఉన్నారని నీతిఆయోగ్‌ గుర్తించింది. ఫలితంగా నిర్ధారణ(Cancer diagnosis)లో జాప్యం జరిగి వ్యాధి ముదిరిపోతోంది. ఈ సమస్యకు డేటాబేస్‌(disease diagnosis database) పరిష్కారం చూపనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.