ETV Bharat / lifestyle

వేసవిలో చల్లగా... ఆరోగ్యానికి తోడుగా - చెరుకు రసం ఎందుకు తాగాలి

ఈ నడివేసవిలో చెరుకురసం దాహార్తిని తీరుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ తీసుకుంటే, అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు అని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు..

benefits-of-sugarcane-juice-in-summer
వేసవిలో చల్లగా... ఆరోగ్యానికి తోడుగా
author img

By

Published : May 1, 2021, 9:21 AM IST

ఎండ ప్రభావంతో శరీరం నిస్సత్తువగా మారినప్పుడు తాజా చెరుకు రసాన్ని తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది. గ్లూకోజును విడుదల చేసి, వెంటనే రక్తంలో తగ్గిపోయిన చక్కెర స్థాయులను పెరిగేలా చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

మూత్రాశయ సమస్యలకు దూరంగా...

ముప్పావు గ్లాసు చెరుకురసంలో చెంచా చొప్పున నిమ్మరసం, అల్లం రసం, ముప్పావుకప్పు కొబ్బరి నీళ్లను కలిపి తాగితే మూత్రాశయ పనితీరు మెరుగుపడుతుంది. ఇది వ్యర్థాలను బయటికి పంపడమే కాకుండా, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్లు రానివ్వదు.

దంత సమస్యలను పోగొట్టి...

చెరుకురసంలో కాల్షియం, ఫాస్పరస్‌వంటి ఖనిజాలు ఎనామిల్‌ను రక్షిస్తూ, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహారలేమి, దంతాల అనారోగ్యం వల్ల వచ్చే నోటి దుర్వాసనను చెరుకు రసం దూరం చేస్తుంది.

జీర్ణశక్తిని మెరుగుపరిచి...

పొటాషియంతోపాటు ఈ రసంలో ఉండే పీచు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్తి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

వ్యాధినిరోధకశక్తిగా...

చెరుకురసంలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్‌ సి వ్యాధినిరోధక శక్తిని పెంచి శ్వాస సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

అందానికీ మేలు!!

తాజా చెరుకు రసాన్ని రెండు చెంచాలు తీసుకుని ముఖానికి మృదువుగా రాసి ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు. అలాగే ముఖానికి లేపనాలు వేసేటప్పుడు లేదా స్క్రబ్బింగ్‌ చేసేటప్పుడు ఆ మిశ్రమంలో చెంచా చెరుకు రసాన్ని కలిపితే చాలు, చర్మానికి అదనపు మెరుపు వస్తుంది.

చెరుకుతో.. చురుకు!
వేసవిలో చెరుకురసం ఉపయోగాలు

వేసవిలో నాలుగైదు రోజులకు ఒకసారి వేడినీళ్లలో నాలుగు చుక్కలు యూకలిప్టస్‌ నూనె వేసి ఆవిరి పడితే కళ్లకు తేటగా ఉంటుంది. ముక్కుపుటాల్లో మంట ఉండదు.

ఇదీ చూడండి: కరోనా వేళ ఒకే గది ఉన్నవారికి అష్టకష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.