కుక్కకాటే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా... అయితే తస్మాత్ జాగ్రత్త. నిండు ప్రాణాలను ఆ ఒక్క గాటే బలిగొనే ప్రమాదం ఉంది. కుక్క, గబ్బిలాల వంటి జీవుల ద్వారా మానవుల శరీరంలోకి ప్రవేశించే రేబిస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 56 వేల మంది రేబిస్ (Rabies Diseases)కి బలవుతున్నారు. అందులో 40 శాతానికి పైగా 15 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఒక్కసారి ఈ వైరస్ (Rabies Diseases) సోకితే ప్రాణాలు పోవడం తప్పా.. మరో మార్గం లేదు. మందే లేని ఈ మహమ్మారికి ముందు జాగ్రత్త పడటమే పరమ ఓషదం.
ఈ ఏడాది తెలంగాణలో ఇప్పటి వరకు సుమారు 90 వేల మంది కుక్కకాటు భారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది 1.34 లక్షల మంది కుక్కకాటుకు గురి కాగా 2019లో అత్యధికంగా 1.44 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కుక్క కరిస్తే ఏముందిలే అనే నిర్లక్ష్యం తగదంటున్నారు వైద్యులు. కుక్క కాటుతో రేబిస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా మందు లేకపోవడం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో కుక్క కాటుకు గురైన వారు కుక్క కరిచిన చోట మంచి నీళ్లతో 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. సబ్బు వంటి వాటిని ఉపయోగించకూడదు. కుక్క కాటుకు గురైన రోజే తప్పక యాంటీ రేబిస్ (Rabies Diseases)వ్యాక్సిన్ తీసుకోవాలి. మూడు నెలల పాటు వైద్యుల సూచనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫలితాంగా వ్యాధి(Rabies Diseases) భారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మరణమే శరణ్యమన్నది నిపుణుల మాట. కుక్క కాటుకు గురైన వారిలో వారం రోజుల నుంచి ఏడాది లోపు ఈ వ్యాధి (Rabies Diseases) లక్షణాలు బయటపడతాయి. ఒక్కసారి లక్షణాలు కనిపిస్తే... గంటల వ్యవధిలోనే మరణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
పెంపుడు కుక్కలకు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ చేపించడంతో పాటు... కుక్క కరిచినా, శరీరంపై గాయాలు ఉన్న చోటా కుక్క లాలాజలం పడినా అప్రమత్తం అవ్వాలి. 12 గంటలలోపే యాంటీ రేబిస్ (Rabies Diseases)టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: World Rabies Day: కుక్క కరిస్తే రేబిస్ ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?