ETV Bharat / lifestyle

ఒత్తైన కనుబొమ్మలు కావాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయాల్సిందే! - suggestions for thick eyebrows

కళ్లతో పాటు.. కనుబొమ్మలూ చూడగానే ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉంటే... మరింత అందంగా కనిపిస్తుంది ముఖం. మరి ఇవి ఒత్తుగా పెరగాలంటే...

tips for thick eyebrows to look very attractive
ఒత్తైన కనుబొమ్మలకు చిట్కాలు
author img

By

Published : Sep 21, 2020, 1:45 PM IST

ఆముదం:

ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు కనుబొమలకు తగిన పోషణ అందిస్తాయి. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల ఆముదాన్ని కనుబొమలకు రాసి మృదువుగా మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తే ఒత్తుగా ఎదుగుతాయి.

కొబ్బరి నూనె:

కండిషనర్‌లానే కాకుండా మాయిశ్చరైజర్‌లానూ ఇది పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ ఇ, ఇనుము వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. పడుకునే ముందు కొబ్బరి నూనెలో దూది ముంచి కనుబొమలకు అద్దండి.. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

ఆలివ్‌ నూనె:

దీంట్లో ఉండే విటమిన్‌- ఎ, ఇ వెంట్రుకల ఎదుగుదలకు తోడ్పడతాయి. రెండు చుక్కల ఆలివ్‌ నూనెను కనుబొమలపై రాసి మర్దన చేయాలి. తరచూ చేస్తే ఫలితం ఉంటుంది.

కలబంద:

ఈ గుజ్జులో ఉండే అలొనిన్‌ కనుబొమలు బలంగా ఎదిగేలా చేస్తుంది. ఇది జెల్‌లా ఉండటం వల్ల చర్మం త్వరగా పీల్చుకుంటుంది. కనుబొమలు బాగా పెరుగుతాయి.

పాలు:

వీటిలో ఉండే ప్రొటీన్లు వెంట్రుకల సంరక్షణకు తోడ్పడతాయి. దూదిని పాలలో ముంచి కనుబొమలపై అద్ది పావుగంట తరువాత నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే సరి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.