ఇప్పుడంతా మాస్కుల ట్రెండే.. ఫ్యాషన్ ప్రపంచంలో భాగం అయిపోతున్నాయి.. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండే కుర్రకారు ఈ ట్రెండ్‌కి నయా లుక్‌ని జోడిస్తున్నారు.. ఇంట్లో ఒకలా.. ఆఫీస్‌లో మరోలా.. సోషల్ లైఫ్‌లో ఇంకోలా.. మాస్క్‌లతో ముస్తాబవుతున్నారు. దుస్తులకు తగ్గట్టు మాస్క్ రంగు ఉండేలా ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు కొందరు రంగురంగుల ఫ్లోరల్ మాస్కులపై మక్కువ చూపుతుంటే మరికొందరు సింపుల్ కలర్లో క్లాసిక్ లుక్కిచ్చే మాస్కులను ఎంచుకుంటున్నారు. ఇంకొందరు క్రియేటివ్ మాస్క్‌లతో ఫన్ ఫొటోలు కొట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. మరింకెందుకాలస్యం. ఇప్పుడెలాగూ మాస్క్ మీ నిత్యజీవితంలో భాగమైపోయిందిగా! మీరూ మీకు నచ్చిన మాస్క్‌ని ఎంచుకోండి. బయటికెళ్లేప్పుడు తప్పక ధరించండి.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు