హైదరాబాద్ బంజరాహిల్స్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శన పోస్టర్‌ను సినీనటి జెన్నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. సినీ నటి జెన్నీ మోడల్స్‌తో కలిసి ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై నడిచి అదరహో అనిపించారు.
ఈ ప్రదర్శనలో వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం రూపొందిన ప్రత్యేక వస్త్రాభరణాలు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. లంగా ఓణి, పట్టువస్త్రాలు ధరించిన అతివలు తమ ర్యాంప్ షోతో ఆకట్టుకున్నారు.
- ఇదీ చూడండి : కదిలే రైల్లోనే అదిరే 'ఖాదీ' ఫ్యాషన్ షో