- రెండు చెంచాల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి ఉల్లిపాయ ముక్కలు, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున వేయాలి. అలాడే రెండు మందారపూలు, కొన్ని పెద్ద ఉసిరికాయ ముక్కలను కూడా వేయాలి. మందారపూలనే కాకుండా ఆకులను కూడా వాడొచ్ఛు చివర్లో అరకప్పు పెరుగు వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టించాలి. బాగా ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానానికి కుంకుడు కాయల రసాన్ని వాడినా మంచిదే.
- మూడు చెంచాల ఆలివ్‌నూనెలో చెంచా ఉసిరిపొడి వేసి కలిపిన మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తే ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు ఇబ్బంది పెడుతుంటే... కొబ్బరినూనె, నిమ్మరసం సమానంగా తీసుకుని తలకు పట్టించాలి. రెండు చెంచాల ఆలివ్‌నూనెలో చెంచా తేనె కలపి జుట్టుకు పట్టించి తలను మృదువుగా మర్దనా చేసుకోవాలి. ఈ ప్యాక్‌తో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వీటిల్లో ఏ పూత వేసుకున్నా.. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీరు, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.
ఇదీ చదవండిః కొవిడ్ చిన్నారుల నుంచి వారాలపాటు వైరస్ వ్యాప్తి