ETV Bharat / lifestyle

చర్మానికి తాజాదనాన్నిచ్చే ఐస్‌ప్యాక్స్‌..! - vasundara news

'అబ్బబ్బ.. ఏమి ఎండలో..! బయట అడుగుపెడితే చాలు.. చర్మం మాడిపోతోంది..' అంటూ చిటపటలాడుతోంది స్వప్న. 'ఈ ఎండల కారణంగా నా చర్మం అంతా జిడ్డుగా మారిపోతోంది' అని బాధపడుతోంది శ్రావ్య. 'ఏం ఎండాకాలమో ఏమో.. కాసేపు బయటికెళ్తే చాలు.. చర్మమంతా నల్లగా తయారవుతోంది..' అంటూ విసుక్కుంటోంది వనజ. వీరే కాదు.. వేసవికాలంలో బయటకు వెళ్లి ఇంటికి చేరిన వెంటనే ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అలా ఉంటున్నాయి మరి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పాలి. ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్యూబ్స్‌తో వేసవి వేడిమి కారణంగా తలెత్తే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

beauty tips for womens
beauty tips for womens
author img

By

Published : Apr 25, 2021, 6:32 PM IST

సాధారణంగా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చాలామంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్యూబ్‌తో చర్మంపై రుద్దుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల కలిగే ఫలితం తాత్కాలికంగా ఉంటుంది. ఈ ఐస్‌క్యూబ్స్‌కు మరిన్ని సహజసిద్ధమైన పదార్థాలను జత చేస్తే అద్భుతమైన ఫలితాలు, దీర్ఘకాలపు ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

skinusingicepack6502.jpg
పాలతో..

పాలతో..
పాలు చర్మానికి అవసరమైన తేమను అందించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు.. మండే వేసవిలో చర్మానికి ఉపశమనం కలిగించడానికి కూడా బాగా ఉపకరిస్తాయి. దీని కోసం ఐస్ ట్రేలో పచ్చిపాలు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇవి క్యూబ్స్‌గా మారిన తర్వాత బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఒక మిల్క్ క్యూబ్‌తో చర్మంపై రుద్దుకొని చూడండి. చర్మానికి చల్లదనంతోపాటు, తగినంత తేమ కూడా అంది తాజాగా కనిపిస్తుంది. కావాలనుకొంటే రోజూ రాత్రి పడుకొనే ముందు ఒక మిల్క్ క్యూబ్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకొని మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. చర్మం యవ్వనంగా, తాజాగా మారుతుంది.

skinusingicepack6503.jpg
ముల్తానీ మట్టి..

ముల్తానీ మట్టి..
సౌందర్య సంరక్షణలో భాగంగా వినియోగించే సాధనాల్లో ముల్తానీ మట్టి కూడా ఒకటి. దీన్ని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి కూడా వినియోగించవచ్చు. ఇందుకోసం..
ముల్తానీ మట్టి- 1 చెంచా, రోజ్‌వాటర్- 4 చెంచాలు చొప్పున తీసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న క్యూబ్స్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకొని పది నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఎండనుంచి చర్మానికి రక్షణ లభించడం మాత్రమే కాదు.. చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

skinusingicepack6504.jpg
పసుపు..

పసుపు..
సహజసిద్ధంగా చర్మాన్ని మెరిపించే గుణం పసుపు సొంతం. అలాగే వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని కోసం పావుకప్పు నీళ్లలో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టేయడమే. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ క్యూబ్స్‌తో ఒకటి లేదా రెండు నిమిషాలపాటు మృదువుగా రుద్దుకుని, నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఫలితంగా చర్మానికి చల్లదనం చేకూరడంతోపాటు మెరుపు కూడా సంతరించుకుంటుంది. అంతేకాదు.. వేసవిలో తలెత్తే పలు చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఇది చక్కని పరిష్కారం.

skinusingicepack650-4.jpg
చాక్లెట్..

చాక్లెట్..
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా సంరక్షించడంతోపాటు తగినంత తేమను అందించి మృదువుగా, మచ్చల్లేకుండా చేస్తాయి. అందుకే వేసవిలో తీసుకునే సౌందర్య సంరక్షణలో భాగంగా చాక్లెట్ ఐస్‌క్యూబ్స్ కూడా ఒక మంచి ఎంపిక అంటున్నారు సౌందర్య నిపుణులు. దీనికోసం ఒక చెంచా డార్క్ చాక్లెట్ పౌడర్‌కు పావుకప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. బయట నుంచి వచ్చిన వెంటనే ఈ క్యూబ్‌తో ముఖం, మెడపై మృదువుగా రుద్దుకోవాలి. చర్మంపై చేరిన మలినాలు తొలగించి, సహజసిద్ధంగా మెరిపించడంలో వీటికి మించినది మరొకటి లేదట!

skinusingicepack6505.jpg
పుచ్చకాయతో..

పుచ్చకాయతో..
చర్మాన్ని సహజసిద్ధంగా మెరిపించే పండ్లలో పుచ్చకాయ ముందువరుసలో ఉంటుంది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ క్యూబ్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకోవాలి. ఫలితంగా ఎండ కారణంగా కమిలి, అలసిపోయిన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. అలాగే ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది.
ఇవే కాదు.. కీరాదోస ముక్కలు, పుదీనా రసం, రోజ్‌వాటర్, ఆరెంజ్ జ్యూస్, హెర్బల్ గ్రీన్ టీ, నిమ్మరసం, స్ట్రాబెర్రీ, కివి, బెర్రీస్, ద్రాక్ష.. మొదలైన పండ్లతో తయారుచేసిన ఐస్‌క్యూబ్స్ కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూనే మేనికి మెరుపుని సైతం చేకూరుస్తాయి. మీరు కూడా వీటిని ఓసారి ట్రై చేసి చూడండి మరి..!

ఇదీ చూడండి: పండ్లు, కూరలు.. వేసవిలోనూ తాజాగా ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.