ETV Bharat / lifestyle

అందుకే 12 ఏళ్ల తర్వాత నా పొడవాటి జుట్టును కత్తిరించుకున్నా! - వసుంధర ఫ్యాషన్​ అప్​డేట్స్​

పొడవాటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటంలా తలమీద నిగనిగలాడుతూ కనిపించే ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డులు సృష్టించింది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్. గతేడాది 200 సెంటీమీటర్ల (6 అడుగుల 6.7 అంగుళాలు) పొడవైన కురులతో ప్రపంచంలో పొడవాటి జుట్టు ఉన్న టీనేజర్‌గా వరుసగా మూడో ఏడాది గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిందీ యంగ్‌ సెన్సేషన్‌. ఇలా ఎంతో అపురూపంగా చూసుకున్న తన పొడవాటి కురులను తాజాగా కత్తిరించుకొని మరోసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది నీలాన్షి.

record holder of world longest hair
పొడవాటి జుట్టు రికార్డు గ్రహీత నీలాన్షి
author img

By

Published : Apr 23, 2021, 2:47 PM IST

తన పొడవాటి కురులతో అందరి నోళ్లలో నానుతోన్న నీలాన్షి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఏడాదికోసారి తన పెరిగిన జుట్టును చూపించి మురిసిపోయే ఈ రియల్‌ లైఫ్‌ రాపంజెల్‌ తాజాగా తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది.

12 ఏళ్ల తర్వాత హెయిర్‌ కట్‌!

మరి పుష్కర కాలం పాటు ఎంతో ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తన పొడవాటి కురులను ఆమె ఎందుకు కత్తిరించుకుందో తెలుసుకుందాం రండి.

ముచ్చటగా మూడుసార్లు!
గుజరాత్‌ రాష్ర్టంలోని అరవల్లి గ్రామానికి చెందిన నీలాన్షికి తన కురులంటే చాలా ప్రేమ. ఎంతలా అంటే సుమారు 12 ఏళ్లుగా జుట్టును ట్రిమ్‌ చేసుకోకుండా పెంచుకుంటూ వచ్చింది. నీలాన్షిని ఆమె స్నేహితులంతా రాపంజెల్ (జర్మన్‌ కార్టూన్‌ క్యారక్టర్‌)తో పోల్చుతారు. తన పొడవాటి కురులతో సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్న ఈ టీనేజ్‌ సెన్సేషన్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో 170.5 సెంటీమీటర్ల పొడవైన కేశాలతో 2018, నవంబర్‌ 21న మొదటిసారిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కింది నీలాన్షి. ఆ తర్వాత 2019, సెప్టెంబర్‌లో 190 సెంటీమీటర్ల కురులతో తన రికార్డును తానే బద్దలుకొట్టి రెండోసారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇక గతేడాది నవంబర్‌లో తన పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తూ 200 సెంటీమీటర్ల పొడవాటి జుట్టుతో ముచ్చటగా మూడోసారి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంది.

పుష్కర కాలం తర్వాత మళ్లీ!

తోటి అమ్మాయిలకు అసూయ కలిగేలా, నిటారుగా నిల్చుంటే చీలమండలను తాకేంత పొడవైన కేశాలతో 12 ఏళ్లుగా జుట్టుపై కత్తెర కూడా పెట్టకుండా తన కురులను పెంచుతోంది నీలాన్షి. అయితే చివరిసారిగా ఆరేళ్ల వయసులో ఒకసారి తన జుట్టును ట్రిమ్‌ చేసుకున్నానంటోందీ యంగ్‌ సెన్సేషన్‌. ఇప్పుడు మళ్లీ తాజాగా తన కురులను కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

NilanshiPatelcutsherhair650-1.jpg
పుష్కరకాలం తర్వాత మళ్లీ

నాకెంతో ఇచ్చింది... అందుకే తిరిగిచ్చేస్తున్నా!

తన కురులతో గతంలో వరుసగా మూడుసార్లు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కి.. తద్వారా నేటి తరం అమ్మాయిలకు ఓ రోల్‌మోడల్‌గా నిలిచింది నీలాన్షి. అయితే భవిష్యత్‌ తరాలకు కూడా తన పొడవాటి వెంట్రుకల గురించి తెలియజెప్పాలనుకున్న ఆమె ప్రఖ్యాత యూఎస్‌ మ్యూజియంలో తన వెంట్రుకలను భద్రపరచాలనుకుంది. ఇందుకోసమే పుష్కరకాలం పాటు ప్రేమగా పెంచుకున్న తన జుట్టును కత్తిరించుకుంది.

‘ఇప్పటివరకు నా జుట్టు నాకెంతో ఇచ్చింది. ‘రియల్ లైఫ్‌ రాపంజెల్‌గా’ అందరూ నన్ను గుర్తుపెట్టుకునేలా చేసింది. ఇప్పుడు దానిని తిరిగివ్వడానికి తగిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం మూడు ఆప్షన్లు నా దగ్గరకు వచ్చాయి. కత్తిరించిన జుట్టును వేలం వేయడం... క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా ఇవ్వడం... మ్యూజియంలో భద్రపరచడం..ఇ లా మూడింటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలనుకున్నాను. ఏం చేద్దామని అమ్మను అడగ్గా మ్యూజియంలో నా జుట్టును భద్రపరిస్తే బాగుంటుందని, భావితరాలు కూడా గొప్పగా చెప్పుకుంటారని సలహా ఇచ్చింది. కావాలంటే క్యాన్సర్‌ బాధితులకు తన జుట్టును విరాళంగా ఇస్తానని అమ్మ చెప్పింది. ఇక ఇన్ని రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న నా కురులను కత్తిరించుకుంటున్నందుకు కాస్త బాధగానే ఉంది.. అదే సమయంలో కొత్త హెయిర్‌ స్టైల్‌లో నేనెలా కనిపిస్తానో అన్న ఆసక్తి కూడా ఉంది. ఈ కొత్త ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుందనుకుంటున్నాను’ అని జుట్టు కత్తిరించుకోవడానికి ముందు తన మనసులోని మాటల్ని పంచుకుందీ యంగ్‌ సెన్సేషన్‌.

NilanshiPatelcutsherhair650-2.jpg

మళ్లీ రికార్డులు సృష్టిస్తా!

12 ఏళ్ల తర్వాత జుట్టును కట్‌ చేసుకుంటోన్న సమయంలో ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా కనిపించింది నీలాన్షి. ఈ సందర్భంగా కత్తిరించిన జుట్టును ప్రేమగా చేతిలోకి తీసుకుని ముద్దుపెట్టుకుంది. అనంతరం మొత్తం 266 గ్రాముల కురులను కత్తిరించుకుని మ్యూజియంకు విరాళంగా సమర్పించింది. ‘నా కొత్త హెయిర్‌ స్టైల్‌ చాలా బాగుంది. యూఎస్‌ మ్యూజియంలో నా కురులను ఉంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్‌ తరాలు కూడా నా జుట్టు గురించి మాట్లాడుకుంటారన్న మాట వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. భవిష్యత్తులో నా జుట్టుతో మరిన్ని ప్రపంచ రికార్డులు సృష్టించగలనన్న నమ్మకం నాకుంది’ అని చెప్పుకొచ్చిందీ టీనేజ్‌ సెన్సేషన్‌.

అప్పుడు రాపంజెల్‌... ఇప్పుడు డోరా!

నీలాన్షి హెయిర్‌ కట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ దీనికి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేసుకోగా.. ఇప్పటివరకు 2.5లక్షల మంది దీన్ని వీక్షించడం విశేషం. ‘ఇలాంటి పొడవాటి జుట్టును కత్తిరించుకోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకవేళ నాకు అలాంటి కురులుంటే అస్సలు కత్తిరించుకునేదాన్ని కాదు. అయినా మీరు ఎంతో తెగువ చూపించారు. అందుకు మీకు హ్యాట్సాఫ్‌. పొడవాటి జుట్టులో రాపంజెల్‌లా కనిపించిన మీరు.. ఇప్పుడు షార్ట్‌ హెయిర్‌లో డోరా (ప్రముఖ యానిమేషన్‌ క్యారక్టర్‌)లా స్వీట్‌ అండ్‌ క్యూట్‌గా దర్శనమిస్తున్నారు’ అని ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ స్పందించారు. ఆమెతో పాటు మరెందరో నెట్‌ ప్రియులు నీలాన్షిని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.