ETV Bharat / lifestyle

ఇంటి నుంచి పనిచేసినా.. ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే! - work from home dress up

లాక్‌డౌన్‌ పుణ్యమాని అప్పటిదాకా అలవాటు లేని కంపెనీలు సైతం ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ని అలవాటు చేసుకున్నాయి. దీంతో ఇంటి నుంచే ఉద్యోగులు సౌకర్యవంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే పని చేయడం కదా అని చాలామంది బద్ధకిస్తూ ఆలస్యంగా నిద్ర లేవడం, లాగిన్‌ అవ్వాల్సిన టైమ్‌ దాటిపోతుందని గబగబా బ్రష్‌ చేసుకొని ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోవడం, కొంతమందైతే ఏదో ఒకటిలే అన్నట్లు ఇంట్లో వేసుకునే నైట్‌ సూట్స్‌ ధరించి పని మొదలుపెట్టేయడం.. వంటివి చేస్తుంటారు. అయితే నీట్‌గా డ్రస్‌ వేసుకోకపోయినా పనిపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు ఆర్గనైజేషనల్‌ నిపుణులు. మనం ఎలాగైతే ఆఫీసుకెళ్లేటప్పుడు ప్రొఫెషనల్‌గా తయారవుతామో.. ఇంటి నుంచి పనిచేసినా అలాగే తయారవ్వాలంటున్నారు వారు. తద్వారా ఇంటి నుంచి పనిచేసినా నీరసించిపోకుండా.. మన పూర్తి దృష్టంతా పనిపైనే నిలిపి మంచి అవుట్‌పుట్‌ అందించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఇంటి నుంచి పనిచేసినా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఎలా తయారుకావాలి? ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తెలుసుకుందాం రండి..

reasons to dress up daily even during work from home
ఇంటి నుంచి పనిచేసినా.. ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే!
author img

By

Published : Jul 6, 2020, 5:54 PM IST

నచ్చిన దుస్తులతో ఉత్సాహంగా..!

చాలామంది ఎలాగూ ఇంటి నుంచే పనిచేయడం కదా ఏ డ్రస్‌ వేసుకుంటే ఏమవుతుందిలే అంటూ ఏ నైటీనో లేదంటే నైట్‌ సూటో వేసేసుకొని కంప్యూటర్‌ ముందు వాలిపోతారు. అయితే మనం వేసుకునే దుస్తులు, వాటి రంగులు మన మనసుపై ప్రభావం చూపుతాయంటున్నారు మానసిక నిపుణులు. ఇంట్లో ఉన్నా సరే.. మనకు నచ్చిన, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల మన మనసు మరింత చురుగ్గా మారుతుంది. దీని ప్రభావం మనం చేసే పనిపై కూడా పడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా వార్డ్‌రోబ్‌లో మీకు నచ్చిన డ్రస్‌ తీసుకొని ధరించండి. అప్పుడు మీకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తద్వారా రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా చురుగ్గా పనిచేసుకోవచ్చు. ఇలా పనిచేయడం వల్ల రోజు పూర్తయ్యే సరికి మీరు చేసిన పనికి సంబంధించిన నాణ్యమైన అవుట్‌పుట్‌ను మీరు అందించవచ్చు.

dressingworkfromhome650-1.jpg
నచ్చిన దుస్తులతో ఉత్సాహంగా..!

కొత్త ప్రయోగాలు చేయండి..!

కొన్ని కార్పొరేట్‌ ఆఫీసుల్లో డ్రస్‌ కోడ్‌ ఉంటుంది. మరికొన్ని ఆఫీసుల్లో ధరించే దుస్తులు ఏవైనా సరే ప్రొఫెషనల్‌గా ఉండాలంటూ కొన్ని నిబంధనలు పెడుతుంటారు. ఇంకొన్ని ఆఫీసుల్లో జీన్స్‌ వేసుకోవడం నిషిద్ధం. అలాంటప్పుడు మన మనసుకు నప్పే డ్రస్‌ ధరించే అవకాశం రాకపోవచ్చు. అయితే అందుకు ఈ లాక్‌డౌన్‌ సమయమే సరైంది. ఇంటి నుంచి పని చేసే క్రమంలో అలాంటి ప్రొఫెషనల్‌ డ్రస్‌ నిబంధనలు ఉండవు. కాబట్టి మనకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. అందుకే మీరు ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు వేసుకోవడానికి వీలు కావట్లేదు అనుకున్న దుస్తులన్నీ ఇప్పుడు బయటికి తీయండి. రోజుకొకటి చొప్పున ధరించి.. ఆయా దుస్తులు ధరించినప్పుడు మీరు ఎలా రడీ కావాలనుకున్నారో అలా తయారైపోండి. ఇలా మీకు నచ్చినట్లుగా తయారవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. అదే ఆనందంతో పని మొదలుపెడితే ఇక మీకు తిరుగుండదు.

dressingworkfromhome650-2.jpg
కొత్త ప్రయోగాలు చేయండి..!

కాస్త పట్టించుకోండి!

లేచామా, ఇంటి పనులన్నీ చేసుకున్నామా, ఆఫీసుకెళ్లామా.. ఉద్యోగం చేసే ఆడవారికి ఈ పనులతోనే సరిపోతుంది. ఇక వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోవడానికి అసలు సమయమే ఉండదు. అయితే ఇలా మన గురించి మనం పట్టించుకోనప్పుడు ఇక మిగతా విషయాలపై కూడా అంతగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఎలాగూ ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు మీకు నచ్చినట్లుగా తయారవడానికి సమయం ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంటి నుంచి పనిచేసే క్రమంలోనైనా ఉదయం అన్ని పనులు త్వరత్వరగా ముగించుకొని ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకునేలా సమయం మిగుల్చుకునే ప్రయత్నం చేయండి. ఆ సమయాన్ని మీకు నచ్చినట్లుగా తయారవడానికి కేటాయించండి. తద్వారా మనకోసం మనం కాస్త సమయం కేటాయించామన్న భావనతో మనసుకు ఏదో తెలియని సంతోషం, సంతృప్తి కలుగుతాయి. అవి రోజంతా మీరు చేసే పనిపై సానుకూల ప్రభావం చూపుతాయి. కావాలంటే ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి.

dressingworkfromhome650-3.jpg
కాస్త పట్టించుకోండి!

బాడీ ఫ్రెష్‌.. ఆలోచనలు ఫ్రెష్‌..

ఇంట్లో నుంచే పని చేస్తున్నాం కదా.. అవతలి వారికేమన్నా మనం కనబడతామా.. ఏంటి? అలాంటప్పుడు రడీ అయితే ఏంటి.. కాకపోతే ఏంటి? అసలు ఉన్న సమయమే ఇంటి పనులు చేసుకోవడానికి సరిపోవట్లేదు.. ఇంకా ఆఫీస్‌కి వెళ్లేటప్పటిలా రడీ కావాలంటే దానికి ఇంకాస్త సమయం వృథా.. అనే భావన మనలో చాలామందిలో ఉంటుంది. అందుకు ఇంటి పనులతో తీరిక లేకపోవడమే కారణం. కానీ అలాంటి భావన నుంచి బయటికొచ్చి ఓసారి మీరు ఆఫీసుకు వెళ్లినప్పుడు ఎలా తయారయ్యారో ఇప్పుడూ అలా రడీ అయి చూడండి.. ఎందుకంటే మన శరీరం ఎంత తాజాగా, ఉత్సాహంగా ఉంటుందో.. మన మనసులో కూడా అంత క్రియేటివ్‌ ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టే ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి వేసుకుందాంలే అంటూ ఆ విషయాన్ని దాటేయకుండా రోజంతా తాజాగా, చురుగ్గా ఉండాలంటే ప్రొఫెషనల్‌గా రడీ అవడం తప్పనిసరి. ఫలితంగా మీరు చేసే పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది. అది మీ కెరీర్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

dressingworkfromhome650-4.jpg
బాడీ ఫ్రెష్‌.. ఆలోచనలు ఫ్రెష్‌..

అలాంటప్పుడు తడబడరు!

ఇంటి నుంచి పనిచేసినా సరే.. ఒక్కోసారి వర్కింగ్‌ టీమ్‌ అంతా కలిసి వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొనాల్సి రావచ్చు.. అయితే ఈ కాన్‌ కాల్స్‌లోనూ ముందే నిర్ణయించుకున్నవి కొన్నుంటాయి.. మరికొన్ని సందర్భాల్లో అనుకోకుండా అందరూ కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి రావచ్చు.. లేదంటే ఇతర కంపెనీ టీమ్‌లతో కలిసి కాన్ఫరెన్స్‌లో మాట్లాడాల్సి రావచ్చు. అలాంటప్పుడు మీరు ప్రొఫెషనల్‌గా రడీ కాకపోతే అందరి ముందు ఏదో తెలియని అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సడెన్‌గా కాన్‌ కాల్‌ అంటే ఆదరాబాదరాగా తయారయ్యే సమయం కూడా ఉండకపోవచ్చు. మరి, ఈ సమస్యలన్నీ తప్పాలంటే.. ఎంచక్కా వర్క్‌ ప్రారంభించడానికి ముందే ప్రొఫెషనల్‌గా తయారవడం మంచిది. తద్వారా మీ పైఅధికారులకు మీపై చక్కటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మీరు ఎంత కంఫర్ట్‌గా ఉంటే మీటింగ్‌లో అంత చురుగ్గా పాల్గొంటారు.. మీ ఆలోచనల్ని అందరితో అంత బాగా పంచుకోగలుగుతారు.

dressingworkfromhome650-5.jpg
అలాంటప్పుడు తడబడరు!

సో.. ఇంట్లో నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా తయారైతే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారుగా! కాబట్టి ఇంట్లో ఉన్నామనే నిర్లక్ష్యంతో ఏదోలా తయారై నిస్సత్తువగా పని మొదలుపెట్టే కంటే.. కాస్త ప్రొఫెషనల్‌గా, మీ మనసుకు నచ్చినట్లుగా తయారై చూడండి.. మీలో ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగుతుంది. అది ఫైనల్‌గా మీ అవుట్‌పుట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.. ఇంకెందుకాలస్యం.. ఈరోజు నుంచే మొదలుపెట్టేయండి మరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.