వంటసోడాతో..
వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కొద్ది నిమిషాలపాటు అలా వదిలేయాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. అలాగే యాపిల్ సిడార్ వెనిగర్, నీళ్లు కలిపి కూడా ప్రయత్నించవచ్చు.
సెనగపిండితో..
మూడు చెంచాల చొప్పున సెనగ, పెసరపిండి తీసుకోవాలి. దీంట్లో కొన్ని పాలు, అరచెంచా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనిచ్చి కడిగేస్తే చాలు. రోజూ ఇలా చేస్తే కొన్నాళ్లకు వైట్ హెడ్స్ తగ్గే అవకాశం ఉంది.
వేపాకులతో..
గుప్పెడు వేపాకుల్లో చెంచా పసుపు వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వైట్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
తెల్లసొనతో..
దీన్ని బాగా గిలక్కొట్టి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే వైట్ హెడ్స్‌ను నియంత్రించవచ్చు.