హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మోడల్స్ సందడి చేశారు. సంప్రదాయ, మోడ్రన్ దుస్తుల్లో ముద్దుగుమ్మలు మెరిసిపోయారు. విభిన్న రకాలైన వస్త్రాలను ధరించి ఆకట్టుకున్నారు. నోవాటెల్‌లో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న డిజైన్ లైబ్రరీ వస్త్రాభరణాల ప్రదర్శన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
సినీ నటి జెన్నీతో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్ ఉత్పత్తులను భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.