- ఎ, బి అవసరం
పైపై పూతలతో వచ్చే అందం తాత్కాలికమే. సహజంగా మీరు కోరుకున్న మార్పు రావాలంటే...మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, చిలగడదుంపలు, నట్స్ మీ ఆహారంలో ఉండాలి. వీటిల్లోని ఐరన్, విటమిన్ ఎ, బి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి. కోడిగుడ్లు, మాంసం, చేపలు వంటివీ తీసుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా జుట్టుకు ప్రొటీన్లు, బయోటిన్ అంది కుదుళ్లు దృఢంగా మారతాయి.
- స్కార్ఫ్ ధరించండి
జుట్టు ఎదుగుదలతో పాటు ఒత్తుగా పెరగాలన్నా ప్రొటీన్లు ఎంతో కీలకం. సూర్యుడి నుంచి విడుదలయ్యే యూవీ కిరణాలు వల్ల వెంట్రుకల్లో ఉండే ప్రొటీన్ల శక్తి తగ్గుతుంది. అందుకే బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకి స్కార్ఫ్ చుట్టుకోండి. ఫలితంగా జుట్టు రాలిపోవడం, తెగిపోవడం, చుండ్రు వంటి సమస్యలు ఎదురుకావు.
- ధ్యానం తప్పనిసరి
మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతుంది. దీనికి పరిష్కార మార్గంగా ధ్యానం, వ్యాయామాలు జీవనశైలిలో భాగం కావాలి. దీనివల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ జరుగుతుంది. తద్వారా వెంట్రుక గట్టిగా ఉండేందుకు కావాల్సిన బలం చేకూరుతుంది.
ఇదీ చదవండిః పట్టులాంటి కురులకు.. బంగారం లాంటి చిట్కాలు!