అందంగా కనిపించడం అంటే ప్రతి ఫ్యాషన్‌నీ అనుకరించడం కాదు.. ఎవరికో నప్పింది మనకి నప్పకపోవచ్ఛు వేసుకునే దుస్తులు సౌకర్యంగా, చూసేవారికి ఎబ్బెట్టుగా అనిపించకుండా చూసుకోవడమే ప్రాథమిక నియమం.
కొందరు తమకంటూ ప్రత్యేక స్టైల్ స్టేట్‌మెంట్ క్రియేట్ చేసుకుంటారు. కేశాలంకరణో, పెట్టుకునే బొట్టో.. ఎంచుకునే డ్రెస్సో.. అది తమకే ప్రత్యేకం అన్నట్లు మార్చేసుకుంటారు. మీరూ అలాంటి ట్రెండ్ ఒకదాన్ని సెట్ చేసుకోండి.
మీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి కదా! అలాగని ఎప్పుడూ ఒకే మూసలో ఉండిపోకూడదు. మార్పులూ ప్రయత్నించాలి. ఉదాహరణకు స్ట్రెయిట్ కట్ కుర్తీల మీదకు లెగ్గింగ్‌లే కాదు.. పలాజోలూ, యాంకిల్ లెంగ్త్ ప్యాంట్లూ ఎంచుకోవచ్ఛు.