ETV Bharat / lifestyle

ఒక్కో ఉద్యోగికి.. రూ.34 కోట్లు ఇచ్చాడు! - nikola corporation in America

ఉద్యోగుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటేనే ఉన్నతి అని నమ్మాడు ట్రావెర్‌ మిల్టన్‌. అందుకే ఉద్యోగంలో చేర్చుకునే రోజే సంస్థ వృద్ధిలో పాలుపంచుకుంటే తన షేర్లలో భాగమిస్తానని వారికి మాటిచ్చాడు. అలా ఆరేళ్ల క్రితం మిల్టన్‌ ఇచ్చిన మాటని అందరూ మర్చిపోయినా అతను మాత్రం మనసులోనే పెట్టుకున్నాడు. అందుకే వ్యాపారంలో జీరోగా ప్రయాణం మొదలుపెట్టి ఫార్చ్యూన్‌ యువ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోవడంతోపాటు తొలినాళ్ల నుంచీ తన సంస్థలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.34కోట్ల చొప్పున చెల్లించి మాట నిలబెట్టుకున్నాడు.

author img

By

Published : Sep 20, 2020, 10:24 AM IST

నికోలా కార్పొరేషన్‌... అమెరికాలో హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులూ, కార్లూ, స్పోర్ట్స్‌ వాహనాలూ, ఇంజిన్లనూ తయారు చేసే సంస్థ. 2014లో ట్రావెర్‌ మిల్టన్‌ ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు అతనికి అప్పులూ... పైకి ఎదగాలనే తపన తప్ప ఆస్తులు గానీ... బ్యాంకు బ్యాలెన్సులుగానీ ఏమీ లేవు. పైగా తన వాళ్ల దగ్గర ఓ ఫెయిల్యూర్‌గా ముద్ర వేయించుకున్నాడు. ఎందుకంటే చిన్న వయసులోనే పలు స్టార్టప్‌లు పెట్టి ప్రారంభించినంత వేగంగా మూసేశాడు.

నికోలా మోటార్స్‌ సంస్థను ప్రారంభించే సమయంలో కూడా ‘నువ్వు మళ్లీ ఫెయిల్‌ అవుతావ్‌ చూడు’ అన్న మాటలే అతనికి వినిపించేవి. ఎలాగైనా కొత్త వ్యాపారంలో విజయం సాధించి తీరాలనే సంకల్పమేమో బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో తననీ, తన కష్టాన్నే నమ్ముకున్నాడు మిల్టన్‌. ఆరేళ్లు తిరిగేసరికి అపర కుబేరుడై... ఉద్యోగుల పాలిట దానకర్ణుడయ్యాడు.

కలియుగ కర్ణుడు

మిల్టన్‌ తండ్రి రైల్వేలో ఉద్యోగి. అతనికి ఓ అన్నయ్యా ముగ్గురు అక్కలూ. తన ఆరో ఏటనే తల్లి క్యాన్సర్‌ బారిన పడటంతో ఆమెకి దాదాపు నాలుగైదేళ్లు ఖరీదైన వైద్యం చేయించారు. అంత కష్టపడ్డా ఆమె ప్రాణం దక్కకపోగా మిల్టన్‌ కుటుంబం అప్పులపాలైంది. దాంతో ఉథా స్టేట్‌లోని సొంత ఇంటిని అమ్ముకుని మిల్టన్‌ కుటుంబం లాస్‌వెగాస్‌ వెళ్లి స్థిరపడింది. అతని తండ్రి మరో సంస్థలో ఉద్యోగం చేస్తూ పిల్లలందర్నీ పోషించేవాడు. అయినా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడంతో మిల్టన్‌ చదువుకోలేకపోయాడు. పైగా అతని తండ్రి ‘నువ్వు పది మందికీ ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప.. ఎవరి ముందూ ఉద్యోగం కోసం చేయి చాచొద్దు’ అని పదే పదే చెబుతుండేవాడు. దాంతో ఎదగాలనే కసి చిన్నతనంలోనే మిల్టన్‌ మనసులో పడిపోయింది.

క్రిస్టియన్‌ మిషనరీ సాయంతో బ్రెజిల్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించాడు. అక్కడే పోర్చుగీస్‌, స్పానిష్‌ భాషల్ని సైతం నేర్చుకున్నాడు. కాలేజీలో చేరినా ఆ చదువును మధ్యలోనే వదిలేసి 2003లో అంటే- 18 ఏళ్ల వయసులో స్వస్థలమైన ఉథాకి తిరిగొచ్చి సీసీ కెమెరాల తయారీకి సంబంధించి ఓ స్టార్టప్‌ పెట్టాడు. అది విఫలం కావడంతో ఆ తరవాత ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారం ప్రారంభించాడు. కొన్నిరోజులకే అదీ బెడిసి కొట్టడంతో మరో వ్యాపారం... అలా పదేళ్లలో ఐదు స్టార్టప్‌లు పెట్టి ఎందులోనూ నిలదొక్కుకోలేక అప్పులపాలయ్యాడు. దాంతో బంధువులూ, స్నేహితుల దృష్టిలో మిల్టన్‌ ఏమీ సాధించలేనివాడిగా మిగిలిపోయాడు.

అయితే ఎవరెంత విమర్శించినా పట్టించుకోకుండా 29ఏళ్ల వయసులో ఆరో స్టార్టప్‌ నికోలా మోటార్స్‌ను ప్రారంభించి హైడ్రోజన్‌తో నడిచే ఇంజిన్లను తయారు చేయడం మొదలు పెట్టాడు. అందుకోసం అందినకాడికి అప్పులు చేసీ బ్యాంకుల్లో రుణాలు తీసుకునీ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. అలానే అత్యుత్తమ ఉద్యోగుల్ని ఎంచుకుని... సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకున్నవారికి తన షేర్లలో కొంత భాగమిస్తానని మాటిచ్చాడు. అలా తను నియమించుకున్న ఉద్యోగులు కూడా మిల్టన్‌ కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో నడిచే ఇంజిన్లను డిజైన్‌ చేయడం, వాటిని మార్కెటింగ్‌ చేయడం, సంస్థ ఎదుగుదల వంటివాటిల్లో ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరించారు. దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు ఉద్యోగులు కూడా తమ సమయానికి మించి అదనపు గంటలు పనిచేసేవారు. ఈ క్రమంలో వారితో మిల్టన్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. తానూ ఉద్యోగులతో కలిసి భోజనం చేయడం, ఆఫీసులోనే పడుకోవడం అతని దినచర్యలో భాగమయ్యాయి.

అలా కష్టపడిన మిల్టన్‌ వేల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు. మోటార్స్‌ రంగంలో టాప్‌ సంస్థల సరసన నికోలానూ నిలబెట్టాడు. ఆరేళ్లు తిరిగేసరికి 33వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మిల్టన్‌ తన ఉద్యోగుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. అందుకే మాటిచ్చినట్టే... తొలి యాభై మంది ఉద్యోగులు ఒక్కొక్కరికీ తన షేర్లలోంచి రూ.34కోట్లు చెల్లించి మరోసారి హీరో అనిపించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.