ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త అమర్త్యసేన్ చిన్నప్పుడు ఏ పుస్తకాలు చదివారో తెలుసుకోవడం ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది కదా! అందుకే నోబెల్ ప్రైజ్ సంస్థ వారు అమర్త్యసేన్ చదువుకున్న లెక్కల పుస్తకం ఇదేనంటూ తమ ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫొటోను షేర్ చేశారు.
నిజానికి ఈ పుస్తకం సంస్కృతంలో ఉంది. సేన్ చదువుకునే సమయానికి సంస్కృతం వాడకం బాగా తగ్గిపోయింది. కానీ వాళ్ల తాతగారు ఆ భాషలో మహాపండితులు. అలా చిన్నారి అమర్త్యసేన్ లెక్కలన్నీ సంస్కృతంలో చదువుకున్నారన్నమాట. ఆ విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ఆ పుస్తకాన్ని కూడా మనకు చూపించింది నోబెల్ ప్రైజ్ సంస్థ.