ETV Bharat / lifestyle

రూపాయి తీసుకోకుండా శిక్షణ ఇస్తాం.. ఉపాధి పొందేలా చేయూతనందిస్తాం - free coaching to get job

ఆత్మవిశ్వాసం స్త్రీలకు ఆభరణం... అది తోడవ్వాలంటే వారికి ఆర్థిక సాధికారత ఎంతో అవసరం. ఆ విషయాన్ని మాటల్లో చెప్పడంకంటే... చేతల్లో చూపించాలనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ధేరం ఉష. అందుకోసం బస్తీల్లోని ఆడపిల్లలూ, మహిళలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆపైన వ్యాపార మెలకువలు నేర్పించి స్వయం ఉపాధి పొందేలా చేయూతనందిస్తున్నారు. ఆ ప్రయత్నం గురించి ఆమె ఏం చెబుతారంటే..

free coaching  for women to get job by dheram usha
రూపాయి తీసుకోకుండా శిక్షణ ఇస్తాం
author img

By

Published : Oct 31, 2020, 12:35 PM IST

ఏతోడూ నీడాలేని రమణి బతకలేక చావే శరణ్యం అనుకుంది. ఓరోజు గుడిమెట్లపై కూర్చుని ఆలోచిస్తోంటే... ‘వృత్తి విద్యలో ఉచిత శిక్షణ’ అని అక్కడ మా సంస్థ ప్రకటన చూసి మా దగ్గరకు పరుగెత్తుకొచ్చి తన గోడు చెప్పుకుంది. ఆ వెంటనే ఆమెకు తాత్కాలిక వసతి కల్పించాం. శిక్షణ తర్వాత రుణం ఇప్పించి బొటీక్‌ ఏర్పాటు చేయించాం. ఈరోజు తన కాళ్లమీద తాను నిలబడటమే కాకుండా ఎంతోమంది మహిళలకు ఆసరా అందిస్తోంది.

ఇంకోరోజు ఒకామె ఏడుస్తూ వచ్చి... ‘నా కాళ్లపై నేను నిలబడితే తప్ప బిడ్డలకు అన్నం పెట్టలేను. భర్త ఇంటి నుంచి బయటకు పంపడు. మీరే ఎలాగైనా ఒప్పించాలి’ అని కోరింది. అదంతా విన్నాక మా సంస్థ సభ్యుల్ని తీసుకుని వాళ్లింటికి వెళ్లి అతడికి కౌన్సెలింగ్‌ చేశాం. ‘మేం జాగ్రత్తగా చూసుకుంటాం’ అని నచ్చజెప్పాం. ఆమెను పంపించాడు కానీ అందంగా కనిపించకూడదని గుండుకొట్టించాడు. ఆమెకు రోజూ ధైర్యం చెప్పేవాళ్లం. శిక్షణ పూర్తిచేసుకుని చిన్న వ్యాపారంతో ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇలాంటి ఉదాహరణలెన్నో!

ఉచితంగా ఉపాధి..

మావారు డాక్టర్‌ కరుణాసాగర్‌ సీనియర్‌ సైంటిస్ట్‌. నాకు ఇద్దరబ్బాయిలు. నేను ఫ్యాషన్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌లో పీజీ డిప్లొమా చేశా. ఆ తరువాత సొంతంగా ఓ బొటీక్‌ నిర్వహించేదాన్ని. ఆ సమయంలో చుట్టుపక్కల ఉండే కొందరు మహిళలు సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవడం గమనించా. అలాంటివారికి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పిస్తే వారి జీవితాల్లో మార్పు వస్తుందని పదేళ్ల క్రితం ‘అభయ అసోసియేషన్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌’ అనే ఎన్జీవోను స్థాపించా. దీనిద్వారా టైలరింగ్‌, మగ్గంవర్క్‌, ఎంబ్రాయిడరీ, జ్యూట్‌ వస్తువులు, శానిటరీప్యాడ్లు, సబ్బులు, షాంపూలతో పాటు పచ్చళ్లు, సాస్‌లు, స్క్వాషెస్‌ తయారీ లాంటివెన్నో నేర్పిస్తాం. ఇక్కడ మా సేవలన్నీ ఉచితమే. ఎంఎస్‌ఎంఈ, జనశిక్షణా సంస్థాన్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ డిపార్ట్‌మెంట్‌... వీటితో కలిసి పనిచేస్తాం. మా దగ్గర శిక్షణ తీసుకున్నవారికి ఆయా సంస్థల ద్వారా సర్టిఫికెట్లనూ అందిస్తాం. మహిళల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అందించే రుణాలు.. ఇవన్నీ వారికి చెబుతాం. అవసరమైన వారికి బ్యాంకులతో మాట్లాడి రుణాలు వచ్చేలా సాయం చేస్తాం.

ఎక్కడెక్కడ నేర్పిస్తామంటే..

మా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని చక్రీపురంలో ఉంది. ఇక్కడే టైలరింగ్‌, శానిటరీ ప్యాడ్స్‌ తయారీ, టై అండ్‌ డై, ఫుడ్‌ ప్రాసెసింగ్‌.. ఇలా ప్రతిదాని కోసం ఓ యూనిట్‌ ఉంది. ఫలానా కోర్సులు ఉచితంగా నేర్పిస్తామంటూ ప్రతినెలా ప్రకటన ఇస్తుంటాం. అయితే మా యూనిట్‌కు వచ్చి నేర్చుకోవడానికి బస్సు ఛార్జీలు లేనివారూ ఉంటారు. అలాంటివాళ్లు ఉన్నచోటకి మేమే వెళ్లి కమ్యూనిటీ హాల్‌ లాంటిది తీసుకుని నెలా, రెండు నెలలపాటు శిక్షణ అందిస్తాం. ఏడాది పొడవునా మా శిక్షణా తరగతులు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్‌తోపాటు నార్కెట్‌పల్లి నల్గొండ, కరీంనగర్‌.. లాంటిచోట్లా సుమారు నాలుగైదు వందల శిబిరాలు నిర్వహించాం. ఈ ప్రయాణంలో మా బృంద సభ్యులు అపర్ణ, సుచిత్రారెడ్డి, అలివేణి నాకెంతో సహకారం అందిస్తున్నారు.

ఇబ్బందులను అధిగమిస్తూ..

ఇవన్నీ చేయాలంటే... చాలా ఓపిక కావాలి. ఒక్కోసారి నైపుణ్యం ఉన్న సిబ్బంది దొరకరు. నిధుల కొరత ఉంటుంది. బంధువులూ, కుటుంబ సభ్యులూ సాయం చేస్తుంటారు. నా ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని దీని కోసమే కేటాయిస్తా. మా దగ్గర శిక్షణ తీసుకుని ఆర్థికంగా నిలబడినవారూ సాయం చేస్తుంటారు. కానీ శిక్షణకు వచ్చేవారి నుంచి ఒక్క రూపాయీ తీసుకోం. ఈ పనులతో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంటా. ఇదంతా చూసి ‘వీటివల్ల మీకేం ప్రయోజనం వస్తుంది’ అని చాలామంది అడుగుతుంటారు. ‘సంతృప్తే’ నాకు వచ్చే పెద్ద లాభం. మహిళలు శక్తికి ప్రతీకలు. కాస్త ఊతం ఇస్తే చాలు అద్భుతాలను సృష్టిస్తారు. మా దగ్గర శిక్షణ తీసుకున్న ఆరువేల మంది మహిళలే అందుకు నిదర్శనం.

ఆడపిల్లల కోసం..

‘గర్ల్‌చైల్డ్‌ ఎడ్యుకేషన్‌’ పేరిట ప్రతిభ ఉండి చదువుకోలేని ఆడపిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తాం. వారికి కావాల్సిన పుస్తకాలూ, దుస్తులూ, ఫీజులకు డబ్బులూ సమకూరుస్తాం. ఇలా ఏడాదికి పాతికమంది ఆడపిల్లలను ఎంపిక చేసుకుని చదివిస్తున్నాం. ఇవేకాకుండా ఏటా మహిళల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. బ్రెస్ట్‌క్యాన్సర్‌తో పాటు గైనిక్‌ సంబంధిత సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాం.’

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.